Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chabdtababu7f3331b6-f81a-4ff6-ae42-db006348c130-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chabdtababu7f3331b6-f81a-4ff6-ae42-db006348c130-415x250-IndiaHerald.jpgజూన్ 4వ తేదీకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసారి ఏపీలో అధికారం ఎవరికి దక్కబోతుంది అనే విషయంపై ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతుంది అయితే తమదే విజయం అని అన్ని పార్టీల నేతలు ధీమాతో ఉన్న అందరి మదిలో కొంత టెన్షన్ మాత్రం ఉండనే ఉంది. అయితే ఇలా కౌంటింగ్ లో ఏం జరగబోతుందో అనే టెన్షన్ లో ఉన్న నేతలను ఇక అటు పోస్టల్ బ్యాలెట్ మరింత భయపెడుతుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ మీద ప్రస్తుతం ఏపీలో పెద్ద యుద్ధమే సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొన్ని నిబంధనలను ఈసీ సవరించడంతో వైసిపి కోర్టుకుChabdtababu{#}GEUM,Election Commission,Indian Postal Service,YCP,TDPపోస్టల్ బ్యాలెట్టే కొంపముంచుతుందా.. జగన్ లో టెన్షన్, బాబులో దైర్యం?పోస్టల్ బ్యాలెట్టే కొంపముంచుతుందా.. జగన్ లో టెన్షన్, బాబులో దైర్యం?Chabdtababu{#}GEUM,Election Commission,Indian Postal Service,YCP,TDPFri, 31 May 2024 15:05:00 GMTపోస్టల్ బ్యాలెట్ మరింత భయపెడుతుంది అని చెప్పాలి.


 ఒక రకంగా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ మీద ప్రస్తుతం ఏపీలో పెద్ద యుద్ధమే సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొన్ని నిబంధనలను ఈసీ సవరించడంతో వైసిపి కోర్టుకు వెళ్ళింది. దేశంలో అన్ని చోట్ల ఎలా ఉందో ఏపీలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఆమోదానికి అలాంటి నిబంధనలు ఉండాలని వైసిపి కోరుతుంది  అయితే ఇలా వైసిపి ఆందోళన చెందడానికి కారణాలు కూడా లేకపోలేదు  పోస్టల్ బ్యాలెట్ ని వేసిన వారిలో నూటికి 90% కు పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే ఎన్నికలకు ముందు తమ డిమాండ్ల సాధన కోసం సుదీర్ఘమైన ఆందోళన చేసిన అంగన్వాడి వర్కర్స్ కూడా ఉన్నారు.


 అయితే వీళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. అందుకే ఇక కూటమి వైపే నిలిచారని ప్రస్తుతం కూటమిలోని నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలా ఏం లేదని ఇక పోస్టల్ బ్యాలెట్ లోని ఓట్లలో తమ వైపుకే ఎక్కువగా మద్దతు ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ కొన్ని పాత సెంటిమెంట్లు చూసుకుంటే మాత్రం అటు వైసీపీలో ఆందోళన మాత్రం అంతకంతకు పెరిగిపోతుంది. 1999లో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన ఉద్యోగులు 2004,2009లలో వైసీపీ వైపు ఉన్నారు. 2014 మళ్ళీ టీడీపీకి జై కొట్టిన ఉద్యోగులు.. ఇక 2019లో వైసీపీ వైపు టర్న్ అయ్యారు. ఇక ఇప్పుడు పాత సెంటిమెంట్లు చూసుకుంటే 2024 లో టిడిపి వైపే ఉన్నారని కూటమి నేతలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఏకంగా ప్రభుత్వాన్ని మార్చే స్థితిలోనే పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఏపీలో అధికార మార్పు కనుక జరిగితే ఇక గేమ్ చేంజర్ గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లే మారబోతున్నాయని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. దీంతో జగన్లో టెన్షన్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లని తమకే వచ్చాయని బాబులో ధైర్యం నిండిపోయిందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>