PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan-even-time-is-fixed-for-oathtaking-too-much-confidentf9163f8c-f35c-49dc-b3e7-cae7e22c73d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan-even-time-is-fixed-for-oathtaking-too-much-confidentf9163f8c-f35c-49dc-b3e7-cae7e22c73d4-415x250-IndiaHerald.jpgరాయలసీమ జిల్లాలలో 49 స్థానాల్లో విజయం సాధించి 2019 ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ 50 స్థానాల్లో విజయం సాధించి సీఎం జగన్ కొత్త చరిత్రను లిఖిస్తారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వై నాట్ 175 అంటున్న వైఎస్ జగన్ వై నాట్ రాయలసీమ అంటూ క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.cm jagan{#}Kurnool;96;Hanu Raghavapudi;TDP;Jagan;Rayalaseema;CM;YCPవై నాట్ రాయలసీమ.. ఇక్కడ 50 సీట్లతో సీఎం జగన్ కొత్త చరిత్రను లిఖిస్తారా?వై నాట్ రాయలసీమ.. ఇక్కడ 50 సీట్లతో సీఎం జగన్ కొత్త చరిత్రను లిఖిస్తారా?cm jagan{#}Kurnool;96;Hanu Raghavapudi;TDP;Jagan;Rayalaseema;CM;YCPFri, 31 May 2024 09:00:00 GMTరాయలసీమ జిల్లాలలో 49 స్థానాల్లో విజయం సాధించి 2019 ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ 50 స్థానాల్లో విజయం సాధించి సీఎం జగన్ కొత్త చరిత్రను లిఖిస్తారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వై నాట్ 175 అంటున్న వైఎస్ జగన్ వై నాట్ రాయలసీమ అంటూ క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
సీమలో ఉమ్మడి కడప, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో వైసీపీకే మెజారిటీ స్థానాలలో అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉండగా ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపూర్ జిల్లాల్లో కూడా వైసీపీ సత్తా చాటనుంది. కుప్పంలో బాబుకు ఘోర పరాజయం తప్పదని వైసీపీ నేతలు లెక్కలతో సహా చెబుతున్నారు. సీమలో 45 నుంచి 50 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే సులువుగా ఈ పార్టీకి విజయం సొంతమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
 
రాయలసీమ జిల్లాల ప్రజలు జగన్ పాలనలో అద్భుతాలు జరగకపోయినా గత ప్రభుత్వాలతో పోల్చి చూస్తే వైసీపీ ఎంతో బెటర్ అనే భావనను అయితే కలిగి ఉన్నారని తెలుస్తోంది. సీమలో ఎవర్ని కదిలించినా వైసీపీనే గెలిపించుకుంటామని చెబుతున్నారు. జగనన్నే సీఎం కావాలని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా జగన్ మామయ్య సీఎం అయితే మాత్రమే తమ బ్రతుకులు బాగు పడతాయని చదువుకునే ఆడపిల్లలు చెబుతున్నారు.
 
జగన్ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందనేది కాదనలేని వాస్తవం అనే సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యతిరేకత జగన్ ను మరీ ఓడించే స్థాయిలో అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఇప్పటికే మొదలైన పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగే ఛాన్స్ అయితే ఉంటుంది. మరో 96 గంటల్లో ఏపీలో అధికారం ఏ పార్టీదో తేలిపోనుంది. సీమలో టీడీపీ ఎప్పటికీ పుంజుకోలేదని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>