PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/what-is-kodali-nanis-majority-in-gudivada3dfd528c-1422-4a1c-85ff-b6efd0dda148-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/what-is-kodali-nanis-majority-in-gudivada3dfd528c-1422-4a1c-85ff-b6efd0dda148-415x250-IndiaHerald.jpgదాదాపు రెండు మూడు నెలల హడావిడి తర్వాత మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. జూన్ 4 వ తేదీన రిజల్ట్ రాబోతుంది. మొదటి నుండి కూడా ఆంధ్ర రాష్ట్రం లో రెండు ప్రధాన పార్టీలు అయినటువంటి వై సీ పీ , కూటమి కృష్ణా జిల్లాలోని గుడివాడ సీటుపై ఎంతో దృష్టి సారించారు. ఎందుకు అంటే ఇక్కడ వై సి పి పార్టీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి కొడాలి నాని పోటీ చేస్తూ ఉంటే , ఈ స్థానంలో ఎలాగైనా తమ అభ్యర్థి గెలవాలి అని కూటమి ప్రయత్నాలను చేసింది. ఇక ఈ ప్రాంతం నుండి కూటమి అభkn{#}Kodali Nani;ramu;Amarnath Cave Temple;Krishna River;Parliment;Air;local language;Janasena;Assembly;June;Party;Bharatiya Janata Partyవైసీపీ విక్టరీ : ఐదోసారి కూడా కొడాలి నాని విజయం కన్ఫామ్ అయినట్లేనా..?వైసీపీ విక్టరీ : ఐదోసారి కూడా కొడాలి నాని విజయం కన్ఫామ్ అయినట్లేనా..?kn{#}Kodali Nani;ramu;Amarnath Cave Temple;Krishna River;Parliment;Air;local language;Janasena;Assembly;June;Party;Bharatiya Janata PartyFri, 31 May 2024 10:20:38 GMTదాదాపు రెండు మూడు నెలల హడావిడి తర్వాత మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. జూన్ 4 వ తేదీన రిజల్ట్ రాబోతుంది. మొదటి నుండి కూడా ఆంధ్ర రాష్ట్రం లో రెండు ప్రధాన పార్టీలు అయినటువంటి వై సీ పీ , కూటమి కృష్ణా జిల్లాలోని గుడివాడ సీటుపై ఎంతో దృష్టి సారించారు. ఎందుకు అంటే ఇక్కడ వై సి పి పార్టీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి కొడాలి నాని పోటీ చేస్తూ ఉంటే , ఈ స్థానంలో ఎలాగైనా తమ అభ్యర్థి గెలవాలి అని కూటమి ప్రయత్నాలను చేసింది.

ఇక ఈ ప్రాంతం నుండి కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము భరిలోకి దిగారు. ఇప్పటికే గుడివాడ నుండి కొడాలి నాని వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకు ఈ ప్రాంతంలో అద్భుతమైన పట్టు ఉంది. ఇక ఐదవ సారి కూడా ఈయన ఇదే ప్రాంతం నుండి సీటు దక్కించుకొని పోటీలోకి దిగారు. ఇక వెనిగండ్ల రాము మొదటి సారి పోటీలోకి దిగడం ఈ సారి కాస్త కూటమి గాలి బలంగా వేస్తూ ఉండడం అలాగే టి డి పి తో పాటు జనసేన , బీజేపీ ఓట్లు కూడా వెనుగండ్ల రాముకు పడే అవకాశం ఉన్నందున ఈయన గెలుస్తాడేమో అని చాలా మంది మొదటి నుండి భావించారు.

కాకపోతే ఎలక్షన్ ల టైం వరకు సీన్ మొత్తం మారిపోయినట్లు తెలుస్తోంది. నాలుగు సార్లు గెలిచిన లోకల్ గా కొడాలి నాని కి పెద్దగా నెగిటివ్ లేకపోవడం , అలాగే వై సి పి పార్టీలో అత్యంత కీలక సభ్యుడిగా కొనసాగుతూ ఉండడం , ఈయనకు కేడర్ బలంగా ఉండడంతో కొడాలి నాని సైడ్ భారీగా ఓట్లు పడ్డట్టు దానితో 5 వ సారి కూడా ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 5 వ సారి కూడా కొడాలి నాని ఈ ప్రాంతం నుండి గెలిచినట్లు అయితే గుడివాడలో ఈయనకు తిరుగులేకుండా పోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>