Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagancbb1f5e4-9b62-4bba-98cb-10190b2e2cbf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagancbb1f5e4-9b62-4bba-98cb-10190b2e2cbf-415x250-IndiaHerald.jpgఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మే 13వ తేదీన జరగగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడ చూసిన కూడా తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఈసారి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోయేది ఎవరు అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఎన్నో విశ్లేషణలు మరెన్నో అంచనాలు.. ఇంకొన్ని నమ్మకాలు.. వీటికి తోడు జోష్యాల మధ్య ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విపరీతమైన చర్చ జరుగుతుంది. అయితే మిగతా వారితో పోల్చి చూస్తే అటు వైసిపJagan{#}Hanu Raghavapudi;Cheque;June;CBN;Jagan;YCP;Yevaru;Success;News;mediaవైసీపీ గెలుపు కన్ఫామ్ అయిపోయిందా.. అందుకే జగన్ ధీమాతో ఉన్నారా?వైసీపీ గెలుపు కన్ఫామ్ అయిపోయిందా.. అందుకే జగన్ ధీమాతో ఉన్నారా?Jagan{#}Hanu Raghavapudi;Cheque;June;CBN;Jagan;YCP;Yevaru;Success;News;mediaFri, 31 May 2024 18:48:00 GMTఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మే 13వ తేదీన జరగగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  రాష్ట్రంలో ఎక్కడ చూసిన కూడా తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఈసారి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోయేది ఎవరు అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఎన్నో విశ్లేషణలు మరెన్నో అంచనాలు.. ఇంకొన్ని నమ్మకాలు.. వీటికి తోడు జోష్యాల మధ్య ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విపరీతమైన చర్చ జరుగుతుంది.


 అయితే మిగతా వారితో పోల్చి చూస్తే అటు వైసిపి గెలుపు ఫిక్స్ అని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే పోలింగ్ రోజు తెరపైకి వచ్చిన కొన్ని కీలక పరిణామాలు వైసిపి గెలుపును ప్రతిబింబిస్తున్నాయి అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయ్. ఎందుకంటే పోలింగ్ రోజు అత్యధిక సంఖ్యలో వృద్ధులు మహిళలు పోలింగ్ బూతుల వద్దకు క్యూ కట్టారు. తద్వారా ఏపీలో రికార్డు స్థాయిలో ఈసారి పోలింగ్ నమోదయింది. అయితే ఇదంతా కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే అని ముందుగా కొంతమంది అనుకున్నప్పటికీ అది జగన్ ఓటే అనే అభిప్రాయాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయ్.



 ఇలా పోలింగ్ ముందు వరకు కూటమి అధికారంలోకి వస్తుంది అని చర్చ జరిగిన పోలింగ్ పూర్తి అయిన తర్వాత మళ్లీ జగనే అనే చర్చ మొదలైంది. ఇక విశ్లేషకులు సైతం వైసీపీ గెలుపు కన్ఫార్మ్ అని చేస్తున్న కామెంట్స్ వైసీపీని పరోక్షంగా బలపరుస్తున్నాయి అని చెప్పాలి. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలన్నింటిని 90 శాతానికి పైగానే అమలు చేసిన విషయాన్ని జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. జగన్ చెప్పిన మాటలను జనాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి వైసీపీని నమ్మడం మొదలుపెట్టారు. జగన్ చెప్పాడంటే చేస్తాడు అనే పేరు కూడా వచ్చేసింది. దానికి తోడు పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఇవ్వకుండా వాలంటీర్లను నిరోధించడం.. మండుటెండల్లో వృద్ధులను  వికలాంగులను ఇబ్బంది పెట్టడం చంద్రబాబు పని అని జనం నమ్మారట. అన్ని అంశాలు వైసిపికి అనుకూలంగా మారాయని.. ఒక వర్గం మీడియా చెబుతుంది. దీంతో వైసిపి గెలుపు తథ్యం అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. జగన్ కూడా ఇదే ధీమాతో ఉన్నారని.. అందుకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>