PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-polls-ysrcp-positive-of-winning-blames-tdp-for-violencebfde0d79-a7c1-4b58-afb2-8734d7f410b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-polls-ysrcp-positive-of-winning-blames-tdp-for-violencebfde0d79-a7c1-4b58-afb2-8734d7f410b3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. ఏపీలో వచ్చేది ఏ ప్రభుత్వం అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లిన... ఎవరిని కదిలించిన... ఏపీలో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు. ఇక మరి కొంతమంది బెట్టింగ్ రాయులైతే... ఏపీ ఎన్నికల ఫలితాలపై తెగ బెట్టింగ్ కాస్తున్నారు. తెలుగుదేశం కూటమి గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ చేస్తుంటే... కాదు కాదు వైసిపి గెలుస్తుందని... కొంతమంది ఆస్తులు కూడా బెట్టింగ్ చేస్తున్నారు. ఇలా.. ఎన్నికల పోలింగ్కు, ఫలితాలకు మధ్య రోజుల తేడా భారీగా ఉంsajjala{#}Kanna Lakshminarayana;Criminal;Tadepalli;gannavaram;london;Telugu Desam Party;News;police;Reddy;Government;Andhra Pradesh;TDP;CM;YCPసజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు ?సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు ?sajjala{#}Kanna Lakshminarayana;Criminal;Tadepalli;gannavaram;london;Telugu Desam Party;News;police;Reddy;Government;Andhra Pradesh;TDP;CM;YCPFri, 31 May 2024 09:32:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. ఏపీలో వచ్చేది ఏ ప్రభుత్వం అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లిన... ఎవరిని కదిలించిన... ఏపీలో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు. ఇక మరి కొంతమంది బెట్టింగ్ రాయులైతే... ఏపీ ఎన్నికల ఫలితాలపై తెగ బెట్టింగ్ కాస్తున్నారు. తెలుగుదేశం కూటమి గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ చేస్తుంటే... కాదు కాదు వైసిపి గెలుస్తుందని... కొంతమంది ఆస్తులు కూడా బెట్టింగ్ చేస్తున్నారు. ఇలా.. ఎన్నికల పోలింగ్కు, ఫలితాలకు మధ్య రోజుల తేడా భారీగా ఉండటంతో... ఏపీలో ఈ పరిస్థితి నెలకొంది.


 ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహాదారులు, వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేస్ తాజాగా నమోదు కావడం జరిగింది. ఏపీ ప్రభుత్వ సలహాదారులు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి పై... క్రిమినల్ కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు.

 తెలుగుదేశం పార్టీ న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం అందుతుంది. వైసిపి పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా రెండు రోజుల కిందట సభ్యుల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపైన టిడిపి న్యాయవాది లక్ష్మీనారాయణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయింది.

 ఐ.పి.సి లోని u/s, 153, 505 ఐపీసీ, 125 ఆర్పిఏ  1951 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనిపై సజ్జల  రామకృష్ణారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది ఇలా ఉండగా... లండన్ వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏపీకి చేరుకోనున్నారు. లండన్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు.అనంతరం గన్నవరం నుంచి తాడేపల్లి లోని తన నివాసానికి వెళ్తారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>