MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/cooli0a34fe1e-347d-40b2-8236-c1ccbcb27765-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/cooli0a34fe1e-347d-40b2-8236-c1ccbcb27765-415x250-IndiaHerald.jpgప్రతి మూవీ ఇండస్ట్రీలో కొన్ని లాంగ్‌ టర్మ్‌ గొడవలు ఉన్నాయి. ఎందుకు ఆ గొడవ మొదలైంది, ఎంతవరకు వెళ్తుంది అనే వివరాలు ఇప్పటి జనాలకు అంతగా తెలియవు. దీంతో ఆ ఇద్దరూ కూడా ఎందుకు గొడవ పడుతుంటారు?కలసి ఎందుకు నటించరు ఎందుకు? అని ఎక్కువగా ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటి వైరాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ – సత్య రాజ్‌ కాంబినేషన్ ఒకటి. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఈ వైరం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఇద్దరు అగ్ర నటుల మధ్య సమస్య ఉంది. అయితే ఇప్పుడు అది తేలిపోయిందని అంటున్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్‌ సినిమాల్లో సత్యరాజCooli{#}sathyaraj;K Balachander;Sukanya;Darsakudu;satya;Manam;Lokesh;Lokesh Kanagaraj;Tamil;News;Director;Government;Rajani kanth;Cinema;Tamilnaduకూలి: బద్ధ శత్రువుతో రజిని.. కెరీర్లోనే స్టైలిష్ మూవీ అవ్వడం పక్కా?కూలి: బద్ధ శత్రువుతో రజిని.. కెరీర్లోనే స్టైలిష్ మూవీ అవ్వడం పక్కా?Cooli{#}sathyaraj;K Balachander;Sukanya;Darsakudu;satya;Manam;Lokesh;Lokesh Kanagaraj;Tamil;News;Director;Government;Rajani kanth;Cinema;TamilnaduFri, 31 May 2024 16:33:22 GMTప్రతి మూవీ ఇండస్ట్రీలో కొన్ని లాంగ్‌ టర్మ్‌ గొడవలు ఉన్నాయి. ఎందుకు ఆ గొడవ మొదలైంది, ఎంతవరకు వెళ్తుంది అనే వివరాలు ఇప్పటి జనాలకు అంతగా తెలియవు. దీంతో ఆ ఇద్దరూ కూడా ఎందుకు గొడవ పడుతుంటారు?కలసి ఎందుకు నటించరు ఎందుకు? అని ఎక్కువగా ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటి వైరాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ – సత్య రాజ్‌ కాంబినేషన్ ఒకటి. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఈ వైరం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఇద్దరు అగ్ర నటుల మధ్య సమస్య ఉంది. అయితే ఇప్పుడు అది తేలిపోయిందని అంటున్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్‌ సినిమాల్లో సత్యరాజ్‌ను మనం చూడలేం. ఎందుకంటే 38 ఏళ్ల క్రితం కలసి నటించిన ఈ ఇద్దరూ తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో ఎప్పుడూ కనిపించలేదు. అయితే ఇప్పుడు 'కూలి' అనే సినిమా కోసం వీరు ఇద్దరూ కలసి నటిస్తున్నారు తెలుస్తుంది. ఈ మేరకు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌  చేసిన ప్రయత్నాలు సక్సెస్‌ అయ్యి రజనీకాంత్‌తో కలసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి సత్యరాజ్‌ ఓకే అన్నారు అని సమాచారం తెలుస్తుంది. ఈ క్రమంలో అప్పుడేమైంది అనే చర్చ స్టార్ట్ అయ్యింది. సుమారు 30 ఏళ్ల క్రితం అంటే 1994లో రజినీకాంత్ 'వీరా' అనే సినిమా సినిమా విడుదలై భారీ విజయం అందుకుంది.


అదే టైంలో సత్యరాజ్సుకన్య జంటగా నటించిన ఓ సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. అలా వచ్చిన రెండు బాగా హిట్టయ్యాయి కానీ బిజినెస్ విషయంలో తన పట్ల డిస్ట్రిబ్యూటర్లు వివక్ష చూపించారని సత్యరాజ్‌ ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన సినిమా విజయోత్సవం కోసం ప్లాన్‌ చేసుకుంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదట. ఆ తర్వాత అదే ప్రాంతంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ సినిమాకు ఛాన్స్‌ ఇచ్చారట. దీంతో కర్ణాటక నుండి వచ్చిన బయటివాడిని తమిళనాడు ప్రభుత్వం నెత్తినబెట్టుకుందని సత్యరాజ్‌ విమర్శలు చేశారట.ఆ తర్వాత చాలా ఏళ్లకు 'శివాజీ'  సినిమాలో విలన్‌ పాత్ర కోసం సత్యరాజ్‌ను కాంటాక్ట్‌ అవ్వగా సత్యరాజ్‌ ఓకే చెప్పలేదట. దీంతో ఆ పాత్రలోకి ఇక సుమన్‌ వచ్చారు. ఇప్పుడు ఇన్నేళ్లకు వీలవుతోంది. ఇక చివరిసారి బాలచందర్ దర్శకత్వంలో 1987 లో వచ్చిన 'మనతిల్ ఉరుది వేండుం' అనే సినిమాలో రజనీకాంత్‌ – సత్యరాజ్‌ అతిథి పాత్రలు చేశారు. తెలగులో ఆ సినిమాను 'సిస్టర్ నందిని' పేరుతో రిలీజ్ చేశారు.ఇదిలా ఉంటే ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే స్టైలిష్ చిత్రంగా లోకేష్ తెరకెక్కిస్తున్నాడట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>