PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-as-chief-minister-of-andhra-pradesh0ef6f8cb-03d6-4aa2-90cf-a41f6e214e1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-as-chief-minister-of-andhra-pradesh0ef6f8cb-03d6-4aa2-90cf-a41f6e214e1f-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని పవన్ అభిమానులతో పాటు నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, సర్వేలలో అనుకూల ఫలితాలు రావడం, వంగా గీత వైసీపీపై పిఠాపురం ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత ఉండటంతో ఎస్వీ.ఎస్.ఎన్ వర్మ పవన్ గెలుపు విషయంలో పూర్తిస్థాయిలో నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. pawan kalyan{#}geetha;Ram Gopal Varma;pithapuram;kalyan;YCP;News;Minister;Andhra Pradesh;TDPపవన్ గెలుపుపై ఆస్తి పందెం అంటున్న ప్రముఖ నేత.. వాళ్ల మైండ్ బ్లాంక్ చేశాడుగా!పవన్ గెలుపుపై ఆస్తి పందెం అంటున్న ప్రముఖ నేత.. వాళ్ల మైండ్ బ్లాంక్ చేశాడుగా!pawan kalyan{#}geetha;Ram Gopal Varma;pithapuram;kalyan;YCP;News;Minister;Andhra Pradesh;TDPThu, 30 May 2024 18:50:00 GMT2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని పవన్ అభిమానులతో పాటు నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, సర్వేలలో అనుకూల ఫలితాలు రావడం, వంగా గీత వైసీపీపై పిఠాపురం ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత ఉండటంతో ఎస్వీ.ఎస్.ఎన్ వర్మ పవన్ గెలుపు విషయంలో పూర్తిస్థాయిలో నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
 
పవన్ గెలుపుపై ఇప్పటికే వందల కోట్ల బెట్టింగ్ అనధికారికంగా జరుగుతోందని వార్తలు వస్తుండగా పవన్ గెలుపుపై ఆస్తి పందెం అంటూ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. వర్మ కామెంట్లతో వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. వర్మ కాన్ఫిడెన్స్ తో పవన్ గెలుపు విషయంలో సందేహాలు అక్కర్లేదని మెజారిటీ విషయంలో మాత్రమే సందేహాలు అని నెటిజన్లు చెబుతున్నారు.
 
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి కూటమి అధికారంలోకి వస్తే పవన్ సులువుగా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ హోం మినిష్టర్ కావాలని ఆ పదవికి అవసరమైన అర్హతలు పవన్ కు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు మరింత మంచి చేయడం ఆయన వల్ల అవుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
 
పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానంగా రైతులకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని కూడా సమాచారం అందుతోంది. ప్రముఖ టీడీపీ నేత వర్మ పవన్ ఫలితంపై చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కోట్ల రూపాయల ఆస్తిని పందెం కట్టడం సాధారణ విషయం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్లకు వైసీపీ నుంచి రియాక్షన్ వస్తుందేమో చూడాలి. పవన్ అభిమానులలో కొంతమంది ఇప్పటికే పవన్ గెలుపునకు సంబంధించి సంబరాలు మొదలుపెట్టారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే సినిమాలు మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
 
 
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>