PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidufd58a465-238f-4d5d-be99-9f5e40359d97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidufd58a465-238f-4d5d-be99-9f5e40359d97-415x250-IndiaHerald.jpg 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఒక బలమైన పార్టీగా ఉందంటే దానికి కారణం అనేక మంది రాజకీయ నాయకులు అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఈ పార్టీని ముందు నడిపించారు ఆయనకి అండదండగా ఉంటూ పార్టీని బలోపేతం చేసిన వారు ఎందరో . సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పటికీ ఈ పార్టీకి లాయల్ గా ఉంటూ దాని విజయానికి కృషి చేస్తున్నారు.chandrababu Naidu{#}GANTA SRINIVASA RAO;Hindupuram;Devineni Uma Maheswara Rao;Tekkali;Anakapalle;District;venkat;Ishtam;Smart phone;Minister;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;CBN;Vishakapatnam;TDP;Government;Elections;Telugu Desam Party;Jagan;Reddy;Partyటీడీపోతే: టీడీపీ ఓడిపోతే మొదటగా జంప్ చేసేది వీళ్లే..?!టీడీపోతే: టీడీపీ ఓడిపోతే మొదటగా జంప్ చేసేది వీళ్లే..?!chandrababu Naidu{#}GANTA SRINIVASA RAO;Hindupuram;Devineni Uma Maheswara Rao;Tekkali;Anakapalle;District;venkat;Ishtam;Smart phone;Minister;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;CBN;Vishakapatnam;TDP;Government;Elections;Telugu Desam Party;Jagan;Reddy;PartyThu, 30 May 2024 09:36:26 GMT1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఒక బలమైన పార్టీగా ఉందంటే దానికి కారణం అనేక మంది రాజకీయ నాయకులు అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఈ పార్టీని ముందు నడిపించారు ఆయనకి అండదండగా ఉంటూ పార్టీని బలోపేతం చేసిన వారు ఎందరో . సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పటికీ ఈ పార్టీకి లాయల్ గా ఉంటూ దాని విజయానికి కృషి చేస్తున్నారు.

 ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా ఈ పార్టీలో కీలక వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు. ఆయన హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు ఈసారి కూడా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఓవరాల్ గా పార్టీ గెలవడమే ఒక పెద్ద అనుమానంగా మారింది. ఎందుకంటే జగన్ బాబుకు గెలిచే ఛాన్స్ ఇవ్వకుండా అన్ని పథకాలను చక్కగా అమలు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రతి ఇంటికి తన ప్రభుత్వం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చారు. వచ్చే ఐదేళ్లలో కూడా ఈ పథకాలు అమలు చేస్తానని మాట ఇచ్చారు.

చంద్రబాబు గతంలో మాట ఇచ్చి చాలాసార్లు తప్పారు కాబట్టి ఆయనను ప్రజలు నమ్మకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు ఓడిపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే  బాబుకు ఇప్పుడు 74 ఏళ్ల వయసు. తదుపరి ఎన్నికలు మరో 5 ఏళ్ల తర్వాత జరుగుతాయి. అప్పుడు ఆయనకు 80 వేల వయసు వస్తుంది ఆ సమయంలో పార్టీ అధినేతగా ఆయన కొనసాగడం కష్టం ఎన్నికల ప్రచారాలు చేయడం కూడా అసాధ్యమే. ఈ పార్టీకి పెద్ద తలకాయ ఆయనే కాబట్టి ఆయన లేకపోతే ఇది పేకమేడల్లా కుప్పకూలిపోతుంది.

 బాబు  రాజకీయ జీవితం ముగిసిపోతే ఆ పార్టీలో సీనియర్ నేతలు ఎవరూ ఉండరు అని చెప్పుకోవచ్చు. లోకేష్ ఎలాగూ అసమర్ధుడు ఆయన కింద పనిచేయడం సీనియర్లకు ఇష్టం ఉండకపోవచ్చు ఒకానొక సమయంలో కె. అచ్చన్నాయుడు లోకేష్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఆ ఫోన్ కాల్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. టెక్కలి నియోజకవర్గం గెలుస్తూ వస్తున్న ఈ సీనియర్ నేత బాబు ఇక టీడీపీ కోసం పని చేయరు అని తెలియగానే వేరే పార్టీకి జంప్ చేయడం ఖాయం.

విశాఖపట్నం నార్త్, భీమిలి, అనకాపల్లి చోడవరం వంటి నియోజకవర్గాల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఈసారి టీడీపీ ఓడిపోతే బయటకు వెళ్లిపోవచ్చు. చంద్రబాబు లాంటి సమర్థవంతమైన నాయకుడు వెళ్ళిపోతే టీడీపీని గెలిపించేది ఎవరు? వైసీపీని ఢీ కొట్టాలంటే ఎంతో రాజకీయ అనుభవం అవసరమవుతుంది. జగన్ చేసే తప్పులను ఎత్తిచూపుతూ, ఆయనకంటే తాము గొప్పగా ఏం చేస్తామో నిరూపించాలి. అది చంద్రబాబుకే సాధ్యం కాని మారింది. సో, పోటీ చేసి ప్రయోజనం లేదని ఆయన అనుకోవచ్చు.

కృష్ణా జిల్లా మాజీ మంత్రి, పలుకుబడి కలిగిన నాయకుడు దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా తన భవిష్యత్తు కోసం వేరే రాజకీయ పార్టీని చూసుకోవచ్చు. అనేక మంత్రి పదవులు నిర్వహించి, విశాఖపట్నం జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు.. పార్టీలో, ప్రభుత్వంలో అపార అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు కళా వెంకట్ రావు, వ్యవసాయ రంగంలో విశేషమైన కృషికి పేరుగాంచిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పార్టీని వీడవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>