PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5d8c795f-dbe5-49ef-8727-50dbf8ddb44c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5d8c795f-dbe5-49ef-8727-50dbf8ddb44c-415x250-IndiaHerald.jpgఅంబటి రాయుడు ఒకప్పుడు వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించినా జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నిర్ణయంతో మొదట్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే, కాలక్రమేణా అంబటి రాయుడు రాజకీయాలకు అసమర్థుడు అనే సంగతి తెలిసింది. అసహనం, అపరిపక్వతతో ఉన్న రాయుడిని సమర్థించకుండా జగన్ మోహన్ రెడ్డి వాటి నుంచి బయటికి గెంటేయడమే మంచి పని అయిందని ఇప్పుడు చాలామంది అంటున్నారు. jagan{#}Ambati Rayudu;VIRAT KOHLI;Cricket;Jagan;India;Party;YCPరాజకీయాలకు అతడు ఒక అసమర్థుడు.. జగన్ మంచి పనే చేశారా..??రాజకీయాలకు అతడు ఒక అసమర్థుడు.. జగన్ మంచి పనే చేశారా..??jagan{#}Ambati Rayudu;VIRAT KOHLI;Cricket;Jagan;India;Party;YCPThu, 30 May 2024 19:07:00 GMTఅంబటి రాయుడు ఒకప్పుడు వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించినా జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నిర్ణయంతో మొదట్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే, కాలక్రమేణా అంబటి రాయుడు రాజకీయాలకు అసమర్థుడు అనే సంగతి తెలిసింది. అసహనం, అపరిపక్వతతో ఉన్న రాయుడిని సమర్థించకుండా జగన్ మోహన్ రెడ్డి వాటి నుంచి బయటికి గెంటేయడమే మంచి పని అయిందని ఇప్పుడు చాలామంది అంటున్నారు.

రాయుడు తన చెడు ప్రవర్తనతో అతని క్రికెట్, రాజకీయ జీవితం రెండింటినీ పాడు చేసుకున్నాడని విమర్శకులు కామెంట్లు చేస్తున్నారు. ఇతరుల పట్ల గౌరవం చూపించడం చాలా ముఖ్యం, మర్యాదగా లేకపోతే సమస్యలు వస్తాయి. ఎవరినీ లెక్క చేయకుండా మాట్లాడటం తరచుగా సమస్యలకు దారి తీస్తుంది.

క్రికెట్ మైదానంలో రాయుడు బాగా రాణించినప్పుడు, అభిమానులు అతనిని ఉత్సాహపరిచారు. కానీ అతను విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లను అనవసరంగా టార్గెట్ చేసినప్పుడు, ప్రజలు అతనిని ఇష్టపడలేదు. కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఇష్టమైన విరాట్ కోహ్లీపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది కోహ్లి అభిమానులకు కోపం తెప్పించి, రాయుడుపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం ఇప్పుడు నేషనల్ వైడ్ గా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆర్సిబి ఓడిపోతే రాయుడు శునకానందం పొందడం అతని చిన్న బుద్ధికి నిదర్శనం గా నిలిచింది. ఒకవేళ అతనిని వైసీపీలోకి తీసుకొని ఉంటే పార్టీ పరువు పోయి ఉండేది.

 ఇలాంటి కామెంట్స్ అందరిపై చేస్తూ పార్టీకి తలవంపులు తెచ్చేవాడు. అసలు ఇండియా తరఫున ఆడీ మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఆయన తన పరువు తానే తీసుకుంటున్నాడు. ఇలా మాట్లాడటం వల్ల అతనికి ఏం ఉపయోగం? కోహ్లీ మీద ఏదైనా కోపం ఉంటే వదిలేయాలి ప్రతి ఒక్కరూ ఇలాగే మాట్లాడుతూ పోతే వారికి సమాజంలో విలువ ఏమీ ఉంటుంది. ఏమైనా జగన్ ముందుగానే ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలరని అంబటి రాయుడు విషయంలో తెలిసిపోయింది. రాయుడులో అసహనం, రెచ్చగొట్టే స్వభావం ఉంది కాబట్టి ఆయన రాజకీయాలకు ఏమాత్రం పనికిరాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>