PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/junior-ntrc7c616c9-a1cc-45bc-a766-8e0178883ac9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/junior-ntrc7c616c9-a1cc-45bc-a766-8e0178883ac9-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో 2024 ఎన్నికలు డిసైడ్ చేయనున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా వస్తే సమస్య లేదు కానీ కూటమి ఓడిపోతే మాత్రం పరిస్థితి ఏంటని ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే ఏ పేరు పెడతారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. junior ntr{#}harikrishnana;Success;politics;NTR;Jr NTR;Telugu Desam Party;Party;CM;TDP;Elections;Andhra Pradeshజూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే ఆ పేరే పెడతారా.. టీడీపీ ఓడిపోతే జరిగేది ఇదేనా?జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే ఆ పేరే పెడతారా.. టీడీపీ ఓడిపోతే జరిగేది ఇదేనా?junior ntr{#}harikrishnana;Success;politics;NTR;Jr NTR;Telugu Desam Party;Party;CM;TDP;Elections;Andhra PradeshThu, 30 May 2024 10:20:00 GMTఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో 2024 ఎన్నికలు డిసైడ్ చేయనున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా వస్తే సమస్య లేదు కానీ కూటమి ఓడిపోతే మాత్రం పరిస్థితి ఏంటని ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే ఏ పేరు పెడతారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
టీడీపీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై ఫోకస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే "అన్నా తెలుగుదేశం" అని పెట్టే ఛాన్స్ ఉంది. చంద్రబాబుపై తిరుగుబాటు చేసి అప్పట్లో హరికృష్ణ అన్నా తెలుగుదేశం పార్టీని పెట్టారు. అయితే ఆ పార్టీ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే చెప్పాలి. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి.
 
అన్నా తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ రెండుగా చీలిపోయే ఛాన్స్ కూడా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పొలిటికల్ గా తన ఆలోచన ఏంటో ఇప్పటివరకు వెల్లడించలేదు. మరో ఐదేళ్ల పాటు తారక్ పూర్తిస్థాయిలో సినిమాలపైనే దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
 
ఏపీ రాజకీయాలను మార్చే ప్రతిభ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని ఈ విషయంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదిపితే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఆ సమయం ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. టీడీపీ ఓడిపోతే ఎన్టీఆర్ కు మాత్రం కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే అంటూ ఏపీ రాజకీయాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అసలోడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో తారక్ ఏపీకి సీఎం కావడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>