PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jawahar-reddy-9464b828-0f4c-4e3d-b7bf-1053cc237c51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jawahar-reddy-9464b828-0f4c-4e3d-b7bf-1053cc237c51-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెరపైకి వచ్చిన మరో పేరు కె ఎస్ జవహర్ రెడ్డి.. వైసిపికి అనుకూలంగా ఉన్నారని.. టిడిపి కూటమిలో భాగంగా బిజెపితో కలిసి ఎలాగైనా సరే సి ఎస్ గా వ్యవహరిస్తున్న కేఎస్ జవహర్ రెడ్డిని తప్పించాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టిడిపి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈయన పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి ఎవరు? ఆయనను కదిపించడానికి టిడిపి ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయి. అనే విషయం ఇప్పుడు చూద్దాం.. 1990 బ్యాచ్ ఐఏఎస్ JAWAHAR REDDY {#}Andhra Pradesh;Telangana;Government;Tirupati;gold;Telangana Chief Minister;Degree;Doctor;TDP;Master;Kothapalli Samuel Jawahar;Reddy;FebruaryK.S. జవహర్ రెడ్డి: 30 ఏళ్ల సర్వీస్ లో చేసిన ఘనతలెన్నో..!K.S. జవహర్ రెడ్డి: 30 ఏళ్ల సర్వీస్ లో చేసిన ఘనతలెన్నో..!JAWAHAR REDDY {#}Andhra Pradesh;Telangana;Government;Tirupati;gold;Telangana Chief Minister;Degree;Doctor;TDP;Master;Kothapalli Samuel Jawahar;Reddy;FebruaryThu, 30 May 2024 12:37:06 GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెరపైకి వచ్చిన మరో పేరు కె ఎస్ జవహర్ రెడ్డి.. వైసిపికి అనుకూలంగా ఉన్నారని.. టిడిపి కూటమిలో భాగంగా బిజెపితో కలిసి ఎలాగైనా సరే సి ఎస్ గా వ్యవహరిస్తున్న కేఎస్ జవహర్ రెడ్డిని తప్పించాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టిడిపి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈయన పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి ఎవరు? ఆయనను కదిపించడానికి టిడిపి ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయి. అనే విషయం ఇప్పుడు చూద్దాం..

1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ హోదాలలో పనిచేశారు. వెటర్నరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసిన ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2022 ఫిబ్రవరి 22వ తేదీన  పదవి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న జవహర్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.

ఇదిలా ఉండగా ఈయన 1986లో రాష్ట్రపతి బంగారు పతకాన్ని దక్కించుకున్నారు.. జవహార్ రెడ్డి ప్రజా సేవకు పర్యాయపదం.. సృజనాత్మకమైన పరిష్కారాలతో.. సంక్లిష్టమైన పరిపాలన సవాళ్ళను అధిగమించే సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తి.. ముఖ్యంగా తన జీవితంలో ఎన్నో ఎత్తు పళ్ళాలు చూశారు. ఎన్నో అవార్డులు,  రివార్డులు సైతం పొందారు. డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తన కెరియర్ లో విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి రంగాలలో విశేష సేవలు అందించారు.. ఇక 1990లో  ఉద్యోగంలో చేరిన ఈయనకు మెడికల్ డిగ్రీ కూడా ఉంది. దీంతో ఆయనకు ఆరోగ్య రంగంలో కూడా లోతైన అవగాహన ఏర్పడింది.. వైద్యరంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు కూడా.. కలెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం లో వివిధ సెక్రటరీ స్థాయి పదవులు కూడా నిర్వహించారు.. ఏ పదవిలో ఉన్నా సరే అందులో ఎన్నో సంస్కరణలు చేసిన ఈయన ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి అనేక ఆరోగ్య కార్యక్రమాలను కూడా అమలు చేశారు..


 గ్రామీణ అభివృద్ధి రంగంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు.. జీవనోపాధిని మెరుగుపరచడంలో ప్రధానంగా కృషి చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇలాంటి అత్యున్నతమైన వ్యక్తి పై టిడిపి పార్టీ కక్ష కట్టి మరీ బదిలీ చేయించాలనే ప్రయత్నాలు చేస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>