PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jr-ntr-nara-family79d8c519-f57f-44b8-a468-ff82b9823843-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jr-ntr-nara-family79d8c519-f57f-44b8-a468-ff82b9823843-415x250-IndiaHerald.jpg•టిడిపి ఓడిపోతే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కే •సందిగ్ధంలో లోకేష్ , నారా చంద్రబాబు నాయుడు •అధికారంలోకి వస్తారా.. (తెలుగుదేశం పార్టీ - ఇండియా హెరాల్డ్ ) తెలుగుదేశం పార్టీకి ఇవే బహుశా చివరి ఎన్నికలు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక అందుకే ఎలాగైనా సరే గెలవాలని కూటమితో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. అయితే మరొకవైపు వైసీపీ వై నాట్ 175 అంటూ నినాదాలు చేస్తూనే మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పలు సర్వేలు కూడా ఈసారి మళ్లీ వైసీపీ చేతిలోJR.NTR;NARA FAMILY{#}News;Hanu Raghavapudi;India;Telangana Chief Minister;NTR;Jr NTR;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;Telugu Desam Party;CBN;June;Party;YCP;TDP;Elections;Andhra Pradeshటీడీపీ ఓడితే: పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేతికి.. నారా కుటుంబం ఇంటికి..!టీడీపీ ఓడితే: పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేతికి.. నారా కుటుంబం ఇంటికి..!JR.NTR;NARA FAMILY{#}News;Hanu Raghavapudi;India;Telangana Chief Minister;NTR;Jr NTR;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;Telugu Desam Party;CBN;June;Party;YCP;TDP;Elections;Andhra PradeshThu, 30 May 2024 10:09:11 GMT•టిడిపి ఓడిపోతే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కే

•సందిగ్ధంలో లోకేష్ , నారా చంద్రబాబు నాయుడు

•అధికారంలోకి వస్తారా..

(తెలుగుదేశం పార్టీ -  ఇండియా హెరాల్డ్ )


తెలుగుదేశం పార్టీకి ఇవే బహుశా చివరి ఎన్నికలు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక అందుకే ఎలాగైనా సరే గెలవాలని కూటమితో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. అయితే మరొకవైపు వైసీపీ వై నాట్ 175 అంటూ నినాదాలు చేస్తూనే మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పలు సర్వేలు కూడా ఈసారి మళ్లీ వైసీపీ చేతిలోకి అధికారం రాబోతోంది అంటూ స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఇదే జరిగితే టిడిపి పార్టీని దివంగత నటులు మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వస్తాయని చెప్పడంలో సందేహం లేదు..

వాస్తవానికి.. సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.. అయితే తనను సినిమాల ద్వారా ఆదరించిన ఆ ప్రజలకు ఏదైనా చేయాలి అన్న సంకల్పంతో తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని స్థాపించి... స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. అలా 1982లో పార్టీని స్థాపించగా.. 1983లో అధికారంలోకి వచ్చి 1995 వరకు ఏకంగా మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన తర్వాత పార్టీ పగ్గాలను.. ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబునాయుడు చేతుల్లోకి తీసుకొని దాదాపు వరుసగా తొమ్మిదేళ్లు పరిపాలన చేసిన ఈయన  2004, 2009లో ఓడిపోయారు..2014లో మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు.. ఇక 2019 నుంచి పదవి కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.. 2019లో వైసిపి అధికారంలోకి రాగా ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా వైసిపి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అయితే ఎన్టీఆర్ వారసత్వంగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలను చేతుల్లోకి తీసుకోవాల్సి ఉండగా.. నందమూరి కుటుంబం దాదాపుగా ఈ పార్టీకి దూరంగానే ఉందని చెప్పాలి.. ఒక బాలకృష్ణ మాత్రమే పార్టీ కోసం పనిచేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలి అని.. తన తాత లాగే పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అటు టిడిపి శ్రేణులతో పాటు ఇటు అభిమానులు , ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కానీ నారా చంద్రబాబు నాయుడు పన్నాగం వల్లే జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ దక్కడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.. ఇక ఎలాగో లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు.. ఆయన గెలుస్తాడు అన్న నమ్మకాలు కూడా ప్రజల్లో లేకుండా పోయాయి..  మరొకవైపు టిడిపి అధికారంలోకి వస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి..  ఇక ఒకవేళ టిడిపి కనుక ఓడిపోతే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాలేరు.. అందుకే ఈసారి పార్టీని ఎన్టీఆర్ తమ చేతుల్లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇక ఈ దెబ్బకి నారా కుటుంబం ఇంటికి వెళ్లాల్సిందే.. మరి ఏది నిజమవుతుందో తెలియాలంటే జూన్ 4 న వెలువడే ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>