Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli1cda701a-c346-4b8c-acc1-bc55398e5a7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli1cda701a-c346-4b8c-acc1-bc55398e5a7c-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఈ ఐసీసీ టోర్నికి వెస్టిండీస్, యుఎస్ లు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఈ వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతుంది. జూన్ 9వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. ఇక ఇప్పటికే అమెరికా చేరుకుని అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది వరుస విజయాలు సాధిస్తKohli{#}vishwa;Yashasvi Jaiswal;American Samoa;VIRAT KOHLI;Pakistan;World Cup;Cricket;Yevaru;India;June;surya sivakumarరోహిత్ వద్దు.. ఓపెనర్ గా అతన్ని పంపించండి : జాఫర్రోహిత్ వద్దు.. ఓపెనర్ గా అతన్ని పంపించండి : జాఫర్Kohli{#}vishwa;Yashasvi Jaiswal;American Samoa;VIRAT KOHLI;Pakistan;World Cup;Cricket;Yevaru;India;June;surya sivakumarThu, 30 May 2024 12:15:00 GMTప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఈ ఐసీసీ టోర్నికి వెస్టిండీస్, యుఎస్ లు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే టీమ్ ఇండియావరల్డ్ కప్ కోసం సిద్ధమవుతుంది. జూన్ 9వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. ఇక ఇప్పటికే అమెరికా చేరుకుని అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే గత ఏడాది వరుస విజయాలు సాధిస్తూ కప్పు గెలిచినంత పని చేసిన టీమిండియా.. ఇక ఫైనల్లో ఓడిపోయి చివరికి నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ లో మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయకుండా అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక విశ్వ విజేతగా అవతరించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది. అయితే ఇక ఈసారి ఓపెనింగ్ జోడిగా ఎవరు బరిలోకి దిగబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైష్వాల్ ను ఎంపిక చేశారు. అయితే గత కొంతకాలం నుంచి కోహ్లీకి కూడా ఓపెనర్ గా వస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం.


 మొన్న ముగిసిన ఐపీఎల్ లో కూడా కోహ్లీ ఓపెనర్ గా వచ్చి ఎంతో మంచి ప్రదర్శన చేశాడు. అయితే ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 వరల్డ్ కప్ లో రోహిత్ కాకుండా విరాట్ కోహ్లీ, యశస్వి జైష్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగాలి అంటూ సూచించాడు. ఓపెనర్ల  భాగస్వామ్యాన్ని బట్టి రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ మూడు నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేయాలి. రోహిత్ స్పిన్ బాగా ఆడతాడు. అతను నాలుగో స్థానంలో వచ్చిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ వసీం జాఫర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఇది కాస్త వైరల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>