PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr256b4335-bcb5-4909-a712-562af7c1e180-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr256b4335-bcb5-4909-a712-562af7c1e180-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.... తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఫోన్ టాపింగ్ వ్యవహారం... చిచ్చు రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... పాలనను పడకకేసి... కేవలం ఫోన్ టాపింగ్ వ్యవహారం చుట్టూనే రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తోంది. పొద్దున లేస్తే చాలు ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అనుకూల మీడియాలో ఫోన్ టాపింగ్ కు సంబంధించిన వార్తలు తప్ప ఇంకొక వార్తలు కనిపించడం లేదు. KCR{#}kavitha;KCR;Revanth Reddy;Telangana;Telangana Chief Minister;Parliment;Bharatiya Janata Party;Smart phone;Congress;media;News;Partyఆ కేసు లో కేసీఆర్ అరెస్ట్ అవుతారా.?ఆ కేసు లో కేసీఆర్ అరెస్ట్ అవుతారా.?KCR{#}kavitha;KCR;Revanth Reddy;Telangana;Telangana Chief Minister;Parliment;Bharatiya Janata Party;Smart phone;Congress;media;News;PartyWed, 29 May 2024 22:30:07 GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో....  తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఫోన్ టాపింగ్ వ్యవహారం... చిచ్చు రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... పాలనను పడకకేసి... కేవలం ఫోన్ టాపింగ్ వ్యవహారం చుట్టూనే రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తోంది.  పొద్దున లేస్తే చాలు ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అనుకూల మీడియాలో ఫోన్ టాపింగ్ కు సంబంధించిన వార్తలు తప్ప ఇంకొక వార్తలు కనిపించడం లేదు. 


అయితే ఫోన్ టైపింగ్ వ్యవహారం అనేది చాలా కామన్ అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా... ఫోన్ టాపింగ్ చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి...  అధికారికంగా ఫోన్ టాపింగ్ చేయాలని  అధికారులకు అప్పగించరని వారు స్పష్టం చేస్తున్నారు. నోటి మాట మేరకు... ఆదేశాలు మాత్రమే ఇస్తారని అంటున్నారు. గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా అలాగే చెప్పి ఉంటారని వారు చెబుతున్నారు. అందుకే ఫోన్ టైపింగ్ వ్యవహారంలో కేసీఆర్ చాలా రిలాక్స్ గా ఉన్నట్లు కూడా వారు వెల్లడిస్తున్నారు.


 అయితే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తర్వాత మళ్లీ ఫోన్ టాపింగ్ వ్యవహారం భారీ ఎత్తులో తెరపైకి వస్తోంది. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, ప్రతిపక్ష నాయకుల ఫోన్ టాపింగ్ చేశారని... గులాబీ ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. కొందరైతే ఈ కేసులో గులాబీ అధినేత కల్వకుంట చంద్రశేఖర రావు అరెస్టు అవుతారని కూడా చెబుతున్నారు. ఇంత పెద్ద కేసు ఉన్న నేపథ్యంలో... కెసిఆర్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదని అటు బిజెపి నేతలు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో కేసీఆర్ అరెస్టు తప్పేలా లేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కు కూడా ప్రమేయం ఉందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.... కెసిఆర్ ఇలాంటి వ్యవహారాల నుంచి ఎలా బయటపడతారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>