PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024bf35a127-b51f-4551-a3f5-ab3dad4d2bea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024bf35a127-b51f-4551-a3f5-ab3dad4d2bea-415x250-IndiaHerald.jpgఇక భీమిలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా? అనేది అనాదిగా వర్క్ ఔట్ అవుతున్న సెంటిమెంట్. ఇది ఇంకా కొనసాగుతూ వస్తోందా? అప్పుడెప్పుడో 83లో టీడీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని 2019 వ సంవత్సరంలో దక్కించుకున్న వైసిపి మళ్ళీ గెలుస్తామన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తుంది.భీమిలి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఏకంగా మూడు లక్షల 60 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇది దాదాపుగా రెండు నియోజకవర్గాలతో సమానం. సముద్ర తీర పట్టణంAP Elections 2024{#}avanthi srinivas;Bheemili;Vishakapatnam;Hanu Raghavapudi;Capital;YCP;Party;Yevaru;TDP;Andhra Pradeshబాబు Vs జగన్: ఈ ఒక్క నియోజకవర్గమే సీఎం ఎవరో నిర్ణయిస్తుంది?బాబు Vs జగన్: ఈ ఒక్క నియోజకవర్గమే సీఎం ఎవరో నిర్ణయిస్తుంది?AP Elections 2024{#}avanthi srinivas;Bheemili;Vishakapatnam;Hanu Raghavapudi;Capital;YCP;Party;Yevaru;TDP;Andhra PradeshWed, 29 May 2024 18:17:00 GMTఇక భీమిలి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా? అనేది అనాదిగా వర్క్ ఔట్ అవుతున్న  సెంటిమెంట్. ఇది ఇంకా కొనసాగుతూ వస్తోందా? అప్పుడెప్పుడో 83లో టీడీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని 2019 వ సంవత్సరంలో దక్కించుకున్న వైసిపి మళ్ళీ గెలుస్తామన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తుంది.భీమిలి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఏకంగా మూడు లక్షల 60 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇది దాదాపుగా రెండు నియోజకవర్గాలతో సమానం. సముద్ర తీర పట్టణం, ఆద్యంతం ఆహ్లాదకర నియోజవర్గం, రూరల్, అర్బన్ మిక్స్‎డ్ ఓటింగ్, అత్యంత పొటెన్షియల్ నియోజకవర్గం, ఐటి హిల్స్, ఎండాడ, మధురవాడ లాంటి ఖరీదైన ప్రాంతాలు అన్నింటికి మించి వైసిపి అధికారంలోకి వస్తే కాబోయే రాజధాని ప్రాంతం కావడంతో విపరీతమైన భారీ హైప్ ఉన్న నియోజకవర్గం ఈ భీమిలి.ఇక ఈసారి గురు శిష్యులైనా గంటా – అవంతిలు శత్రువులుగా మారి టీడీపీ, వైసిపి నుంచి పోటీ పడ్డారు.


ఇద్దరూ ఇప్పటి దాకా ఓటమి ఎరుగకపోవడంతో పోటీ చాలా ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ఇది టీడీపీ కంచుకోటగా ఉన్నా.. ఇప్పుడు వైసిపి కూడా అక్కడ సంస్థాగతంగా బాగా బలపడింది. అందులో కూడా ఆనందపురం, పద్మనాభం, భీమిలిలో ఎక్కువ రూరల్ గ్రామాలు ఉండడంతో సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మళ్ళీ మద్దతు ఇస్తారని నమ్ముతోంది వైసిపి. అదే సమయంలో ఇప్పటి దాకా పోటీ చేసిన చోట మళ్ళీ చేయకుండా వరుసగా ఐదు ఎన్నికల్లో నెగ్గిన గంటా టీడీపీ నుంచి పోటీ చేయడంతో అటువైపు కూడా ఆసక్తి బాగా పెరిగింది. 2019 వ సంవత్సరంలో విశాఖ నార్త్ నియోజకవర్గంలో గెలిచి నియోజకవర్గానికి అసలు వెళ్ళని గంటాను గెలిపిస్తారా? లేదంటే నిరంతరం అందుబాటులో ఉండే తనకు ఓటేస్తారా? అంటూ అవంతి చేసిన అప్పీల్‎కు భీమిలి ఓటర్లు ఎలా స్పందిస్తారో, ఎవరు అక్కడ గెలుస్తారో, ఎవరూ అధికారం చేపడుతారో అన్న చర్చ ఇప్పుడు బాగా జోరుగా మొదలైంది. దీంతో ఈ సీటు గెలుపుపై అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>