EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ktr2cfb5f9c-7fb9-47e2-be40-51adaa3bfac9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ktr2cfb5f9c-7fb9-47e2-be40-51adaa3bfac9-415x250-IndiaHerald.jpgరేవంత్‌ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక కొన్ని మార్పులు చేశారు. టీఎస్‌ స్థానంలో టీజీ తీసుకొచ్చారు. బాగానే ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర గీతంగా జయజయహే ను ప్రకటించారు. అదీ బాగానే ఉంది. కానీ.. రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేస్తామని చెప్పడం వివాదాస్పదం అవుతోంది. వాస్తవానికి ఏలే లక్ష్మణ్‌ రూపొందించిన రాష్ట్ర చిహ్నం బాగానే ఉంది. కానీ.. దాన్ని కూడా మారుస్తాననడం వివాదానికి దారి తీస్తోంది. దీనిపై కేటీఆర్‌ మండిపడుతున్నారు. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోమని...ktr{#}Golconda;KTR;Warangal;Telangana Chief Minister;Minister;Hyderabad;CM;Telangana;Reddyరేవంత్‌ రెడ్డి.. అనవసరంగా ఆ విషయంలో వేలు పెట్టారా? కేటీఆర్‌ కుమ్మేస్తున్నారుగా?రేవంత్‌ రెడ్డి.. అనవసరంగా ఆ విషయంలో వేలు పెట్టారా? కేటీఆర్‌ కుమ్మేస్తున్నారుగా?ktr{#}Golconda;KTR;Warangal;Telangana Chief Minister;Minister;Hyderabad;CM;Telangana;ReddyWed, 29 May 2024 10:00:00 GMTరేవంత్‌ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక కొన్ని మార్పులు చేశారు. టీఎస్‌ స్థానంలో టీజీ తీసుకొచ్చారు. బాగానే ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర గీతంగా జయజయహే ను ప్రకటించారు. అదీ బాగానే ఉంది. కానీ.. రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేస్తామని చెప్పడం వివాదాస్పదం అవుతోంది. వాస్తవానికి ఏలే లక్ష్మణ్‌ రూపొందించిన రాష్ట్ర చిహ్నం బాగానే ఉంది. కానీ.. దాన్ని కూడా మారుస్తాననడం వివాదానికి దారి తీస్తోంది. దీనిపై కేటీఆర్‌ మండిపడుతున్నారు.


రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోమని... పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని కేటీఆర్ అంటున్నారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని కేటీఆర్ చెప్పారు. ఇదేం రెండు నాల్కల వైఖరి... ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అని సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు.


కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం... చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని కేటీఆర్ అడిగారు. అవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు.. అన్న కేటీఆర్.. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని కేటీఆర్ పేర్కొన్నారు. జయ జయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ? అని అడిగిన కేటీఆర్... “కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్ ” అని తెలిపారు.


అధికారిక గీతంలో కీర్తించి..!! అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..?? అని కేటీఆర్ ప్రశ్నించారు. చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు.. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్ అన్న కేటీఆర్... కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదు.. సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమని వివరించారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడమంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అన్న మాజీ మంత్రి కేటీఆర్..
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమేనని వ్యాఖ్యానించారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>