PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vanga-gita29550970-9db0-435f-a7fe-cf8fc6ea452c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vanga-gita29550970-9db0-435f-a7fe-cf8fc6ea452c-415x250-IndiaHerald.jpgవైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత చాలా టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెకు ఎంపీ సీటు ఇచ్చినట్లయితే ఈ రేంజ్ లో ఆందోళన చెందే వారు కాదేమో లేదంటే ఆమెకు అనుకున్న సీటు ఇచ్చినట్లయితే గెలుస్తాననే గాంభీర్యంతో ఉండేవారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారేమో అని ఆమె భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అతని సామాజిక వర్గానికి చెందిన కాపు ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఈమె చాలా సీనియర్ నేత. వయస్సు పైబడటం వల్ల ఒక కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి లాగా ప్రజల్లో మమేకం కాలేకపోతున్నారుVanga Gita{#}lord siva;anil kumar singhal;Kasi;MP;Deputy Chief Minister;geetha;pithapuram;Janasena;June;Yevaru;kalyan;Jagan;YCPతీవ్ర భావోద్వేగానికి లోనైన వంగా గీత.. ఎందుకో తెలిస్తే??తీవ్ర భావోద్వేగానికి లోనైన వంగా గీత.. ఎందుకో తెలిస్తే??Vanga Gita{#}lord siva;anil kumar singhal;Kasi;MP;Deputy Chief Minister;geetha;pithapuram;Janasena;June;Yevaru;kalyan;Jagan;YCPTue, 28 May 2024 20:12:06 GMT వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత చాలా టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెకు ఎంపీ సీటు ఇచ్చినట్లయితే ఈ రేంజ్ లో ఆందోళన చెందే వారు కాదేమో లేదంటే ఆమెకు అనుకున్న సీటు ఇచ్చినట్లయితే గెలుస్తాననే గాంభీర్యంతో ఉండేవారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారేమో అని ఆమె భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అతని సామాజిక వర్గానికి చెందిన కాపు ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఈమె చాలా సీనియర్ నేత. వయస్సు పైబడటం వల్ల ఒక కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి లాగా ప్రజల్లో మమేకం కాలేకపోతున్నారు.

పిఠాపురం ఆమెకు కొత్త. పైగా పవన్ కళ్యాణ్ కోసం చాలామంది ప్రచారం చేశారు డబ్బులు కూడా బాగానే పెంచారు. పవన్ కి పాపులారిటీ కూడా ఎక్కువే. ఈ అన్ని కారణాలవల్ల వంగా గీత భయపడుతున్నారు. ఈసారి ఓడిపోతే ఇక ఆమె రాజకీయ జీవితం ముగిసినట్లే. ఎందుకంటే ఇప్పటికే ఆమె వృద్ధాప్యం వైపుగా అడుగులు వేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత ఆమెకు మళ్ళీ సీట్ లభించకపోవచ్చు. అందుకే మే 11వ తేదీన లాస్ట్ క్యాంపెనింగ్ రోజున జగన్ మాట్లాడుతున్నప్పుడు కంటతడి పెట్టుకున్నారు. అప్పుడు ఆమెను జగన్ ఓదార్చాల్సి వచ్చింది. అంతేకాదు ఆమె గెలిచేలా జగన్ ఒక కీలక ప్రకటన కూడా చేశారు. వంగా గీతను డిప్యూటీ సీఎం చేసి పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతానని తెలిపారు.

ఇప్పుడు శివుడు కొలువై ఉన్న కాశీకి కూడా ఆమె వెళ్లారు. కాశీ విశ్వనాథ్ ఆలయంలో బాగా ఏడ్చేస్తూ తాను గెలిచేలాగా ఆశీర్వదించాలని ప్రార్థించారట. ఈ దృశ్యాలు అక్కడున్న వారు చూశారట. శివలింగాన్ని ఆలింగానం చేసుకొని మరీ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు అక్కడ చూసినవారు అంటున్నారు. మరి ఆమె ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ అని పేర్కొంటున్నారు. మరి ఎవరు గెలుస్తారో జూన్ 4వ తేదీనే తేలుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>