PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr2919e500-46a0-4399-916d-a5c98f742502-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr2919e500-46a0-4399-916d-a5c98f742502-415x250-IndiaHerald.jpgఅక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన తెలంగాణ మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (టాస్క్ ఫోర్స్) రాధా కిషన్ రావు ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పెద్దాయన’గా మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని ఆయన అభివర్ణిస్తూ కొన్ని షాకింగ్ ఆరోపణలు చేశారు. దాంతో కేసీఆర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యే పోచింగ్ ఎపిసోడ్‌ని కేసీఆర్ వ్యక్తిగతంగా ప్లాన్ చేసి పర్యవేక్షించారని మాజీ పోలీసు అధికారి పేర్కొన్నారు. ktr{#}contract;Thota Chandrasekhar;Tandur;Santhossh Jagarlapudi;kavitha;KCR;Smart phone;Traffic police;Delhi;Telangana;police;Telangana Chief Minister;MLA;Bharatiya Janata Party;CM;Partyకేసీఆర్‌ను ఇరకాటంలో పడేసిన మాజీ పోలీస్ అధికారి..?కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసిన మాజీ పోలీస్ అధికారి..?ktr{#}contract;Thota Chandrasekhar;Tandur;Santhossh Jagarlapudi;kavitha;KCR;Smart phone;Traffic police;Delhi;Telangana;police;Telangana Chief Minister;MLA;Bharatiya Janata Party;CM;PartyTue, 28 May 2024 19:51:00 GMTఅక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన తెలంగాణ మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (టాస్క్ ఫోర్స్) రాధా కిషన్ రావు ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పెద్దాయన’గా మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని ఆయన అభివర్ణిస్తూ కొన్ని షాకింగ్ ఆరోపణలు చేశారు. దాంతో కేసీఆర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యే పోచింగ్ ఎపిసోడ్‌ని కేసీఆర్ వ్యక్తిగతంగా ప్లాన్ చేసి పర్యవేక్షించారని మాజీ పోలీసు అధికారి పేర్కొన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విముక్తి కల్పించేందుకు ఈ చట్ట విరుద్ధమైన చర్యకు కేసిఆర్ పాల్పడినట్లు కిషన్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పొచింగ్ కేసును ఉపయోగించుకుని బీజేపీతో ఒప్పందం కుదుర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని కిషన్ రావు పేర్కొన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను ఇటీవలే అరెస్టు చేశారు. ఆమె ఇప్పటివరకు బయటకు రాలేకపోయారు. జైల్లోనే జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది.

మరోవైపు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కొందరు బీజేపీ నేతలు పార్టీ మారే ప్రతిపాదనతో సంప్రదించారని కేసీఆర్ గతంలో తెలుసుకున్నారట. వీరి మధ్య ఏం జరుగుతుందో రహస్యంగా గమనించాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు కేసీఆర్ సూచించినట్లు మాజీ పోలీస్ అధికారి ఆరోపించారు.

అనంతరం పోలీసులు ఉచ్చు బిగించి బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. జాతీయ నేత బీఎల్‌ను కూడా పట్టుకోవాలన్నారు. స్కామ్ నుంచి కవిత పేరును క్లియర్ చేయడానికి సంతోష్ అతనిని ఉపయోగించుకున్నాడు. అయితే ఈ పథకం ప్లాన్ చేసినట్లు జరగలేదు. దాంతో మాతా అమృతానందమయి సంస్థకు చెందిన ఓ ముఖ్యమైన వ్యక్తి పరారయ్యాడు. దీంతో కేసీఆర్‌కు కోపం వచ్చిందట.

ఎమ్మెల్యే పొచింగ్ కేసులో ఎప్పుడూ నిర్దోషి అని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం కల్పితమని చెబుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ మాజీ పోలీస్ అధికారి ఆరోపణలతో ఇరకాటంలో పడ్డారని చెప్పుకోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>