PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ap-election-betting314b0fcd-01fb-43d7-bed3-4accb4927b02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ap-election-betting314b0fcd-01fb-43d7-bed3-4accb4927b02-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రెండు మూడు నెలలుగా బెట్టింగ్స్‌ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇవి దాదాపు ఐపీఎల్ బెట్టింగ్స్‌తో సమానంగా జరుగుతున్నాయి. వేలకోట్ల డబ్బు బెట్టింగ్స్ కార్యకలాపాల్లో పెట్టడం జరుగుతోంది. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల వంటి నేతల గెలుపు పై ఎక్కువగా పందేలు జరుగుతున్నాయి. అలాగే ఏ పార్టీ గెలుస్తుంది ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనే అంశాలపై కూడా పందేలు కాస్తున్నారు. AP election betting{#}Y. S. Rajasekhara Reddy;Sharmila;TDP;Party;MLA;Jagan;YCP;Indiaఏపీ ఎన్నికల బెట్టింగ్‌లో అదిరిపోయే ట్విస్ట్..??ఏపీ ఎన్నికల బెట్టింగ్‌లో అదిరిపోయే ట్విస్ట్..??AP election betting{#}Y. S. Rajasekhara Reddy;Sharmila;TDP;Party;MLA;Jagan;YCP;IndiaTue, 28 May 2024 18:10:00 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రెండు మూడు నెలలుగా బెట్టింగ్స్‌ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇవి దాదాపు ఐపీఎల్ బెట్టింగ్స్‌తో సమానంగా జరుగుతున్నాయి. వేలకోట్ల డబ్బు బెట్టింగ్స్ కార్యకలాపాల్లో పెట్టడం జరుగుతోంది. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల వంటి నేతల గెలుపు పై ఎక్కువగా పందేలు జరుగుతున్నాయి. అలాగే ఏ పార్టీ గెలుస్తుంది ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనే అంశాలపై కూడా పందేలు కాస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. మొన్నటిదాకా టిడిపి ప్లస్ కూటమి గెలుస్తుందని చాలామంది బెట్టింగ్ కాశారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ గెలుస్తుందంటూ ఇప్పుడు రెట్టింపు స్థాయిలో బెట్టింగ్స్ పెడుతున్నారట. అలాగే రూపాయికి రెండు రూపాయలు ఇచ్చే లాగా డీల్స్ కుదుర్చుకుంటున్నారు. అంటే, వైసీపీపై ఎవరైనా రూ.లక్ష పందెం కాస్తే, ఆ పార్టీ గెలిస్తే అతనికి/ఆమెకు రూ.2 లక్షలు వస్తాయి.

 మరో రిపోర్ట్ ప్రకారం బెట్టింగ్ ఫీల్డ్‌లో ఎక్కువ నిష్పత్తి అంటే ఒక పార్టీ ఓడిపోతుంది అని లేదా ఒక పని జరగదు అని అర్థం. దీన్ని ఒక క్యూగా తీసుకుంటే, జగన్ నేతృత్వంలోని పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు భారీగా బెట్టింగ్‌లు కాస్తున్నారని అర్థమవుతోంది. వైసీపీ ఓడిపోతే తమ పోలింగ్ పెట్టుబడులను తిరిగి పొందాలనే ఉద్దేశ్యంతో కొంతమంది వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా తెలుగుదేశం+ కూటమిపై పందెం వేయడం ప్రారంభించారని కొందరు పేర్కొంటున్నారు.

 ఏది ఏమైనా ఈ బెట్టింగ్స్ బాగా షాక్ ఇస్తున్నాయి. నిమ్మకాయల ప్రకారం అంచనాలు విశ్లేషణల ప్రకారం బెట్టింగ్స్ కాసే తీరు మారిపోతోంది. కష్టపడి సంపాదించిన డబ్బును ఇందులో పెట్టడం చాలా తెలివి తక్కువ నిర్ణయం. బెట్టింగ్స్‌లో ఓడిపోతే చాలా డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది. దీనివల్ల మానసికంగా, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదాలు ఎక్కువ. బెట్టింగ్స్ కారణంగా చాలామంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి వీటి జోలికి ఎవరూ వెళ్లకూడదని ఇండియా హెరాల్డ్ పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>