PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-rayalasimaa576f99d-9b27-4db9-b44f-81af3beb9dbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-rayalasimaa576f99d-9b27-4db9-b44f-81af3beb9dbc-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ప్రస్తుతం లోక్సభ హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరు విడుదలలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగాయి. మరో విడత బాకీ ఉంది. జూన్ మొదటి వారంలో ఏడవ విడత ఎన్నికలు పూర్తికాగానే... అదే వారంలో ఫలితాలు వస్తాయి. ఇలాంటి నేపథ్యంలో... ఎన్ డి ఏ కు 400 వందల సీట్లు వస్తాయని బిజెపి నేతలు చెబుతున్నారు. chandrababu{#}Narendra Modi;central government;Chakram;Prime Minister;Elections;Parliment;Telugu Desam Party;Bharatiya Janata Party;Andhra Pradesh;CBN;Telugu;India;Minister;Party;Juneబీజేపీ: ప్రధానిని డిసైడ్ చేయనున్న చంద్రబాబు ?బీజేపీ: ప్రధానిని డిసైడ్ చేయనున్న చంద్రబాబు ?chandrababu{#}Narendra Modi;central government;Chakram;Prime Minister;Elections;Parliment;Telugu Desam Party;Bharatiya Janata Party;Andhra Pradesh;CBN;Telugu;India;Minister;Party;JuneMon, 27 May 2024 08:12:24 GMTదేశవ్యాప్తంగా ప్రస్తుతం లోక్సభ హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరు విడుదలలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగాయి. మరో విడత బాకీ ఉంది. జూన్ మొదటి వారంలో ఏడవ విడత ఎన్నికలు పూర్తికాగానే... అదే వారంలో ఫలితాలు వస్తాయి. ఇలాంటి నేపథ్యంలో... ఎన్ డి ఏ కు 400 వందల సీట్లు వస్తాయని బిజెపి నేతలు చెబుతున్నారు.


 అటు ఇండియా కూటమి... తమకి ఎక్కువ సీట్లు వస్తాయని...  అధికారం ఈసారి మాదేనని స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దేశంలో... హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏంటని... ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇండియాలో హంగ్ ఏర్పడితే...  ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ పార్టీలకు డిమాండ్ కూడా విపరీతంగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో... హంగ్ ఏర్పడితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు... కేంద్రంలో చక్రం తిప్పుతారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.



గతంలో కూడా చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కూడా నారా చంద్రబాబు... సేవలను నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. యునైటెడ్ ఫ్రంట్ అలాగే వాజ్పేయి హయాంలో ఎన్డీఏ ను చంద్రబాబు నాయుడు శాసించిన సంగతి మనందరికీ తెలిసిందే.



 అప్పుడు కేంద్రంలో చక్రం తిప్పి.. ప్రధాని ఎవరు కావాలి అనేదానిపై.. డిసైడింగ్ ఫ్యాక్టర్ గా అయ్యారు చంద్రబాబు. అన్ని పార్టీలను కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి అధికారం ఏర్పాటు చేయడానికి ఒక 50 సీట్లు ఎన్డీఏ కూటమికి అవసరం వస్తే... చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా.. తమిళనాడు, తెలంగాణ,  ఏపీ ఒడిస్సా, రాష్ట్రాలలో... ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేయగల సత్తా చంద్రబాబుకు ఉంది.



 అవసరమైతే కెసిఆర్ దగ్గరికి వెళ్లి కూడా మాట్లాడుతారు చంద్రబాబు. తెలంగాణలో గులాబీ పార్టీకి ఏడు నుంచి 8 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందట. ఇలా ఒక్కొక్క పార్టీ కలుపుకుంటే 50 సీట్లు ఈజీగా అవుతాయి. వీరందరినీ చంద్రబాబు ఏకం చేసి.. ఎన్డీఏ కు సపోర్ట్ ఇచ్చేలా చేస్తారు. ఈ విధంగా దేశ ప్రధాని నీ డిసైడ్ చేసే చంద్రబాబులో ఉందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>