PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-political-news-latest-janasena-pawan-kalyan-pavan-kalyan-kutami7f1158c3-df04-4e8c-ae5f-7cc9c60d6baa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-political-news-latest-janasena-pawan-kalyan-pavan-kalyan-kutami7f1158c3-df04-4e8c-ae5f-7cc9c60d6baa-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలలో జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు. ఓ ముక్కలో చెప్పాలంటే బహుశా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి, ఏ ఒక్క సీట్ కూడా గెలవక పోయినా కూడా ఓ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నది ప్రపంచంలో ఒకే ఒక్కడు. అతడే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును, ఆయన ధైర్యానికి ప్రత్యర్ధులు ఉలిక్కి పడతారు. ఆయన వేసిన ప్రశ్నలకు అర్ధాలను నాయకులు డిక్షనరీలలో వెతుకుతూ వుంటారు. ఆయన ఆవేశ పూరిత ప్రసంగానికి ఆంధ్ర యువత దాసోహం అంటుంది. అలాంటి పవన్ గత కొన్ని రోజులుగా మూగబోయారు. ఎక్కడ ఉన్నారు అంటే ఎవరికీ తెలియదుandhra political news latest janasena pawan kalyan pavan kalyan kutami{#}advertisement;Kasi;Janasena;Pawan Kalyan;kalyan;MP;TDP;MLA;Manam;media;Yevaruజనసేనాని పవన్ గొంతు మూగబోయింది ఎందుకని?జనసేనాని పవన్ గొంతు మూగబోయింది ఎందుకని?andhra political news latest janasena pawan kalyan pavan kalyan kutami{#}advertisement;Kasi;Janasena;Pawan Kalyan;kalyan;MP;TDP;MLA;Manam;media;YevaruMon, 27 May 2024 13:00:00 GMTఏపీ రాజకీయాలలో జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు. ఓ ముక్కలో చెప్పాలంటే బహుశా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి, ఏ ఒక్క సీట్ కూడా గెలవక పోయినా కూడా ఓ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నది ప్రపంచంలో ఒకే ఒక్కడు. అతడే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును, ఆయన ధైర్యానికి ప్రత్యర్ధులు ఉలిక్కి పడతారు. ఆయన వేసిన ప్రశ్నలకు అర్ధాలను నాయకులు డిక్షనరీలలో వెతుకుతూ వుంటారు. ఆయన ఆవేశ పూరిత ప్రసంగానికి ఆంధ్ర యువత దాసోహం అంటుంది. అలాంటి పవన్ గత కొన్ని రోజులుగా మూగబోయారు. ఎక్కడ ఉన్నారు అంటే ఎవరికీ తెలియదు అనే అంటున్నారు. కారణం ఏమై ఉంటుంది?

పవన్ మే 13న పోలింగ్ రోజున మంగళగిరిలో తన ఓటుని వేసాక తరువాత మరుసటి రోజు వారణాసిలో మోడీ నామినేషన్ సందర్భంగా కనిపించారు. అక్కడ నుంచి ఆయన కాశీ విశ్వేశ్వరుణ్ణి సతీసమేతంగా దర్శించుకుని హైదారబాద్ చేరుకున్నారు. అదిగో ఇక అక్కడ నుంచి ఆయన నుంచి అప్డేట్స్ లేవు. ఆ తరువాత ఆయన పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు. ఈ మధ్య ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య పెద్ద మాటల యుద్ధాలే జరుగుతున్నాయి. మేమే గెలుస్తున్నామని అంటే మేమే గెలుస్తున్నామని ఒకరికి మించి ఒకరు పలు సోషల్ మీడియా వేదికగా గప్పాలు కొడుతున్నారు. కానీ పవన్ నుంచి మాత్రం ఆ తరహా అతి ప్రకటనలు రావడం లేదు అని అంటున్నారు విశ్లేషకులు.

అయితే పవన్ మౌనం కూడా ఒక వ్యూహం అని అంటున్నారు మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు. మాటలు కాదు ముఖ్యం చేతలు అన్నదే పవన్ స్ట్రాటజీ కావచ్చు అని అంటున్నారు. మనమేమిటో రిజల్ట్స్ మాట్లాడినపుడు మనం మాట్లాడాల్సిన పని ఎందుకుంటుంది? అని అంటున్నారు. అంతేకదా... ఈవీఎంలలో ఓటు చేరింది. ఎవరు విజేత అన్నది పక్కాగా తేల్చేది అది. ఈ మధ్యలో ఆర్భాటంగా ప్రకటనలు చేయడం దేనికి? ఇదే జనసేన ఫిలాసఫీగా ఉంది అని అంటున్నారు. రెండు ఎంపీ సీట్లూ 21 ఎమ్మెల్యే సీట్లలో పూర్తిగా విజయావకాశాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. అవును, కౌంటింగ్ కి ముందు లేనిపోని ప్రకటనలు చేసి ఆ తరువాత ఇబ్బందులు పడడం కంటే కూడా మంచి రిజల్ట్స్ ని చూపించి, ఆ మీదట జనంలోకి వెళ్తే ఆ కిక్కే వేరబ్బా అన్నదే ఇపుడు జనసేనాని ఉద్దేశం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>