PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gannavaram88c3fd55-dc24-4d01-8b34-a75ab337180e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gannavaram88c3fd55-dc24-4d01-8b34-a75ab337180e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో... అందరూ ఫలితాలపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది తెలుగుదేశం కూటమి గెలుస్తుందని విశ్లేషిస్తుంటే... మరికొంతమంది మరోసారి జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని చెబుతున్నారు. 150 సీట్ల కంటే ఎక్కువ మరోసారి జగన్మోహన్ రెడ్డికి వస్తాయని.. కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. gannavaram{#}vamsi;gannavaram;Vallabhaneni Vamsi;Yarlagadda Venkatrao;Venkata Rao;Kala Venkata Rao;Yevaru;Success;Janasena;Jagan;YCP;Andhra Pradesh;June;Reddy;Hanu Raghavapudi;Parliment;Telugu Desam Party;Assembly;Partyగన్నవరంలో వంశీకి చుక్కలు చూపిస్తున్న టీడీపీ అభ్యర్థి ?గన్నవరంలో వంశీకి చుక్కలు చూపిస్తున్న టీడీపీ అభ్యర్థి ?gannavaram{#}vamsi;gannavaram;Vallabhaneni Vamsi;Yarlagadda Venkatrao;Venkata Rao;Kala Venkata Rao;Yevaru;Success;Janasena;Jagan;YCP;Andhra Pradesh;June;Reddy;Hanu Raghavapudi;Parliment;Telugu Desam Party;Assembly;PartyMon, 27 May 2024 09:13:57 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో... అందరూ ఫలితాలపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది తెలుగుదేశం కూటమి గెలుస్తుందని విశ్లేషిస్తుంటే... మరికొంతమంది మరోసారి జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని చెబుతున్నారు. 150 సీట్ల కంటే ఎక్కువ మరోసారి జగన్మోహన్ రెడ్డికి వస్తాయని.. కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి.


 ఇక ఇటు తెలుగుదేశం కూటమికి 100 సీట్లకు పైగా వస్తాయని కూడా కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి... గన్నవరం రాజకీయాలు చాలా స్థాయికి చేరాయి. ఈసారి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందని చెబుతున్నాయి సర్వేలు. వాస్తవానికి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ ఆరు సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.


 2019 అసెంబ్లీ ఎన్నికల్లో... జగన్ వేవ్ కనిపించినా కూడా... గన్నవరం మాత్రం తెలుగుదేశం గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించాడు. అప్పుడు వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ బరిలో ఉండగా... యార్లగడ్డ వెంకట్రావు మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి అయ్యాడు.


 దీంతో.. గన్నవరం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీని అడుగడుగునా టార్గెట్ చేసి యార్లగడ్డ వెంకట్రావు చాలా సక్సెస్ అయ్యారట. పోల్ మేనేజ్మెంట్ వంశీ కంటే వెంకట్రావు బాగా చేశారట. జనసేన నేతలను కలుపుకొని వెళ్లారట వెంకటరావు. అంతేకాకుండా నియోజకవర్గంలో డబ్బులు విపరీతంగా ఖర్చు చేశారట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. దీంతో ఈసారి వల్లభనేని వంశీ పని అయిపోయినట్లేనని.... నాయకులు చెబుతున్నారు. కాగా, మొత్తానికి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అలాగే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్...  జూన్ 4వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>