MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinu3b1660d2-6e2b-480e-a4a9-075d30cff9da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinu3b1660d2-6e2b-480e-a4a9-075d30cff9da-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో గెటప్ శీను ఒకరు. ఈయన తెలుగు ప్రముఖ కామెడీ షో లలో ఒకటి అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇందులో అనేక రకమైన గెటప్ లలో కనిపించి ప్రేక్షకులకి కనువిందు చేయడంతో ఈయనకు గెటప్ శ్రీను గా గుర్తింపు లభించింది. ఇకపోతే ఇన్ని సంవత్సరాలపాటు టీవీ షో లలో , సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగించిన గెటప్ శీను తాజాగా రాజు యాదవ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి కృష్ణమాచారి దర్శకత్వం వహించాడు. ఇదSrinu{#}Telugu;Hero;Comedy;Jabardasth;Box office;king;television;Audience;Posters;Cinema;Cricket2 రోజుల్లో "రాజు యాదవ్" మూవీ కి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!2 రోజుల్లో "రాజు యాదవ్" మూవీ కి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Srinu{#}Telugu;Hero;Comedy;Jabardasth;Box office;king;television;Audience;Posters;Cinema;CricketSun, 26 May 2024 20:55:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో గెటప్ శీను ఒకరు. ఈయన తెలుగు ప్రముఖ కామెడీ షో లలో ఒకటి అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇందులో అనేక రకమైన గెటప్ లలో కనిపించి ప్రేక్షకులకి కనువిందు చేయడంతో ఈయనకు గెటప్ శ్రీను గా గుర్తింపు లభించింది. ఇకపోతే ఇన్ని సంవత్సరాలపాటు టీవీ షో లలో , సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగించిన గెటప్ శీను తాజాగా రాజు యాదవ్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ కి కృష్ణమాచారి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మే 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ఓ ట్రైలర్ ను విడుదల చేసింది  అందులో శ్రీను కి క్రికెట్ ఆడుతుండగా మూతి కి ఓ గాయం తగులుతుంది. దానితో ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా తన ఫేస్ అవుతుంది. ఇక దానికి ఆపరేషన్ చేయించడం కోసం ఇంట్లో వాళ్ళను డబ్బు అడగడం , వారు మాత్రం అందుకు సహకరించకపోవడం ఇలా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇలా ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరి ఈ సినిమా ఇప్పటికే విడుదల అయ్యి రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్ లను దక్కాయి అనే వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రాని ముగిసే సరికి తెలుగు రాష్ట్రాల్లో 1.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>