PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cbn-jagan-ysr-pawan-tdp-ycp-congressd06ee7e3-045e-4ed1-a567-69ff19040ce6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cbn-jagan-ysr-pawan-tdp-ycp-congressd06ee7e3-045e-4ed1-a567-69ff19040ce6-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయ చరిత్రలో ఆ నాలుగు స్థానాలే కీలకం. ఈ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే తప్పక రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ అనేది గత కొన్ని పర్యాయాల నుంచి వస్తోంది. మరి ఈ నియోజకవర్గాల ప్రజలు అంతగా అప్డేట్ అయి ఉంటారా లేదంటే వారు కావాలని పార్టీలకు అధికారం ఇస్తారా అనేది ఇంతవరకు తెలియడం లేదు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ప్రతిసారి సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతోంది. మరి అవేంటి వివరాలు చూద్దాం..cbn;jagan;ysr;pawan;tdp;ycp;congress{#}Y. S. Rajasekhara Reddy;NTR;Jagan;Yevaru;TDP;YCP;CBN;Andhra Pradesh;June;Congress;Partyఏపీ:ఆ 4 స్థానాల్లో వైసిపి ఓడితే చంద్రబాబే సీఎం..!ఏపీ:ఆ 4 స్థానాల్లో వైసిపి ఓడితే చంద్రబాబే సీఎం..!cbn;jagan;ysr;pawan;tdp;ycp;congress{#}Y. S. Rajasekhara Reddy;NTR;Jagan;Yevaru;TDP;YCP;CBN;Andhra Pradesh;June;Congress;PartySun, 26 May 2024 06:36:28 GMT ఏపీ రాజకీయ చరిత్రలో ఆ నాలుగు స్థానాలే కీలకం. ఈ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే తప్పక రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ అనేది గత  కొన్ని పర్యాయాల నుంచి వస్తోంది. మరి ఈ నియోజకవర్గాల ప్రజలు అంతగా అప్డేట్ అయి ఉంటారా లేదంటే వారు కావాలని పార్టీలకు అధికారం ఇస్తారా అనేది ఇంతవరకు తెలియడం లేదు.  ఈ నాలుగు నియోజకవర్గాల్లో ప్రతిసారి సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతోంది. మరి అవేంటి వివరాలు చూద్దాం.. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 46 ఏళ్లుగా ఒకే పార్టీని గెలిపిస్తూ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తున్నారు ఈ నాలుగు నియోజకవర్గాల ప్రజలు. ఇవి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏంటయ్యా అంటే భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరం. ఈ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే సెంటిమెంటు ప్రకారం ఆ పార్టీ పవర్ లోకి వస్తుందట. 1978లో ఈ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు అప్పుడు కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. 1983, 85 లో టిడిపి అభ్యర్థులు ఈ నాలుగు స్థానాల్లో గెలిచారు అప్పుడు ఎన్టీఆర్ పవర్ లోకి వచ్చారు. 1989లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది.

1994, 99 లలో టిడిపి జెండా ఎగరవేశారు మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చింది. ఇక 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇంకా 2009లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత  ఇక 2014లో ఆ నాలుగు స్థానాల్లో టిడిపి గెలిచింది అప్పుడు చంద్రబాబు పవర్ లోకి వచ్చారు. ఇక 2019లో వైఎస్ఆర్ సీపీకి ఈ నాలుగు స్థానాల్లో పట్టం కట్టారు. దీంతో జగన్ అధికారంలోకి వచ్చారు. ఈ విధంగా 46 సంవత్సరాల నుంచి పొలిటికల్ సెంటిమెంటుతో వస్తున్న ఈ నాలుగు నియోజకవర్గాలపై ప్రస్తుతం రాష్ట్ర నాయకుల కన్ను పడింది. ఈ 2024లో ఈ నాలుగు స్థానాల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపైనే ఆసక్తి నెలకొంది.

 మరి ఈసారి ఈ రిజల్టు రివర్స్ అవుతుందా లేదంటే అదే సెంటిమెంట్ మళ్ళీ  రిపీట్ అయి  వైసీపీ అధికారంలోకి వస్తుందా అనేది చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఇక వైసిపి నాయకులు ఏమో మా పార్టీయే ఆ నాలుగు స్థానాల్లో విజయ బాగుటా ఎగర వేయబోతుందని మేమే గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు. ఇదంతా తెలియాలి అంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>