PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-1a416d88-711b-4b68-867b-285f9034fe54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-1a416d88-711b-4b68-867b-285f9034fe54-415x250-IndiaHerald.jpgగత పదేళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ఎన్నో ఘనతలను సాధించింది. కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా చేయగలిగింది. ఇంకా చెప్పుకోదగిన ఎన్నో కొత్త మార్పులు వచ్చాయి కానీ ఇండియా ఒకటి కోల్పోయింది. అదేంటంటే మీడియాపై విశ్వసనీయత. ప్రపంచవ్యాప్తంగా నాలుగు దిక్కులకు సంబంధించిన సమాచారాన్ని నిష్పక్షపాతంగా ప్రజలకు అందించడమే న్యూస్ పేపర్లు, టీవీల పని. కానీ గత పదేళ్ల కాలంలో మీడియా వర్గాలు దేశ ప్రజలలో విశ్వతనీయతను కోల్పోయాయి. మంచీ, చెడూ రెండిటినీ విశ్లేషించి న్యూస్ ప్రెసెంట్ చేయాల్సిన సంస్థలు ఆ పని మానేసాయి. తమకు modi {#}Kathanam;Andhra Jyothi;Nijam;Narendra Modi;Prime Minister;Andhra Pradesh;India;media;Newsమోదీ పాలనలో ఇండియా కోల్పోయింది చాలా విలువైనదే..??మోదీ పాలనలో ఇండియా కోల్పోయింది చాలా విలువైనదే..??modi {#}Kathanam;Andhra Jyothi;Nijam;Narendra Modi;Prime Minister;Andhra Pradesh;India;media;NewsSun, 26 May 2024 14:50:00 GMTగత పదేళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ఎన్నో ఘనతలను సాధించింది. కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా చేయగలిగింది. ఇంకా చెప్పుకోదగిన ఎన్నో కొత్త మార్పులు వచ్చాయి కానీ ఇండియా ఒకటి కోల్పోయింది. అదేంటంటే మీడియాపై విశ్వసనీయత. ప్రపంచవ్యాప్తంగా నాలుగు దిక్కులకు సంబంధించిన సమాచారాన్ని నిష్పక్షపాతంగా ప్రజలకు అందించడమే న్యూస్ పేపర్లు, టీవీల పని. కానీ గత పదేళ్ల కాలంలో మీడియా వర్గాలు దేశ ప్రజలలో విశ్వతనీయతను కోల్పోయాయి. మంచీ, చెడూ రెండిటినీ విశ్లేషించి న్యూస్ ప్రెసెంట్ చేయాల్సిన సంస్థలు ఆ పని మానేసాయి. తమకు కావాల్సిన, అనుగుణంగా ఉన్న, సొంత ప్రయోజనాలు చేకూర్చేలా వార్తలు రాసుకుంటున్నాయి. ఎడిటోరియల్ కాలమ్స్‌ రాజకీయ పార్టీలకు అమ్ముకుంటున్నాయి. ఆ ఎడిటోరియల్ కాలంలో పార్టీలు తమకు కావలసినట్టు విషయాలను రాయించుకుంటుంన్నాయి. ఒకప్పుడు ఎడిటోరియల్ అంటే ఒక అంశంపై సమగ్రంగా మంచి చెడుల గురించి రాసే ఒక సుదీర్ఘ కథనం కానీ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ రాసే ప్రమోషనల్ ఆర్టికల్ గా మారిపోయింది.

ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పేపర్లు జర్నలిజంతో పాటు ఎడిటోరియల్ విభాగాన్ని బాగా దిగజార్చాయి. రాజకీయ నాయకులే ఎదుటోరియల్ కాలం రాసే లాగా స్వేచ్ఛను కూడా అందిస్తున్నాయి ఈ పత్రికలు. దీని ఫలితంగా ఏమైంది? విశ్వసనీయత, నిష్పాక్షికత అనేవి మంట కలిసిపోయాయి. ఒక ఏపీ రాష్ట్రంలోనే కాదు భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, జాతీయంగా కూడా మీడియా అనేది డబ్బుల కోసం వెంపర్లాడుతోంది కానీ ప్రజలకు నిజాన్ని నిజంగా చూపించేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే అలాగని మీడియాని పూర్తిగా బహిష్కరించగలమా అంటే లేదు అనే చెప్పాలి. ఎందుకంటే దేశంలో జరిగే సమాచారాన్ని వెంటనే కళ్ళకు కట్టినట్లు చూపించగలరు. ఒకరికి కొమ్ముకాస్తూ వార్తలు వడ్డించడం వేరు అలాగే సామాన్యుల గురించి మిగతా అంశాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వేరు.

 ఆ అప్డేట్స్‌ అనేవి సమాచారం తెలుసుకోవాలనుకునే వారికి చాలా అవసరం కాబట్టి పత్రికలు, డిజిటల్ న్యూస్ మీడియా సంస్థలు మనకు కావాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది మీడియా వెంటనే తెలియజేస్తుంది అయితే అందులో నిజం ఉందా లేదంటే అబద్ధం ఉందా అనేది మాత్రం తెలపడం లేదు. పుకార్లు వస్తున్నాయంటూ వెంటనే వార్తలు రాసి వడ్డిస్తున్నారు అందులో నిజం ఉన్నది మాత్రమే మనకి తెలియజేస్తే అప్పుడు ఏదైనా ఉపయోగం ఉంటుంది. వార్తలు రాయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు టైం వేస్ట్ అలాగే ఒక వార్త నిజం అంటూ రాసుకోవచ్చు తర్వాత అది అబద్ధం అంటే ఎవరికీ వార్తలు చదవబుద్ధి కాదు. ఇక కొన్ని మీడియాలో రాజకీయ నాయకులకు తలొగ్గి వారి అరాచకాలను ఎక్కడా కూడా చూపించడం లేదు. ఈ తీరు అనేది మారాలి మారుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>