MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ade2d5b06b-fa98-4f46-b62e-d3a16820ecec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ade2d5b06b-fa98-4f46-b62e-d3a16820ecec-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ సిద్ధంగా ఉంది.ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ చిత్రం వచ్చే నెల అంటే జూన్ 27న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ వరుస అప్డేట్లు ఇస్తూ సినీ ప్రేక్షకాభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటి దాకా సినిమాపై ఓ రకమైన హైప్ ఉండేది. కానీ మొన్న నిర్వహించిన బుజ్జి ఎంట్రీ ఈవెంట్‌తో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి చేరిపోయాయి.బుజ్జి లాంచ్ ఈవెంట్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేKalki 2898 AD{#}krishnam raju;Masala;Mass;Hollywood;Chitram;vijay kumar naidu;Prabhas;June;Cinema;Newsకల్కి 2898 ఏడి: ట్రైలర్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్?కల్కి 2898 ఏడి: ట్రైలర్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్?Kalki 2898 AD{#}krishnam raju;Masala;Mass;Hollywood;Chitram;vijay kumar naidu;Prabhas;June;Cinema;NewsSun, 26 May 2024 15:57:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ సిద్ధంగా ఉంది.ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ చిత్రం వచ్చే నెల అంటే జూన్ 27న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ వరుస అప్డేట్లు ఇస్తూ సినీ ప్రేక్షకాభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటి దాకా సినిమాపై ఓ రకమైన హైప్ ఉండేది. కానీ మొన్న నిర్వహించిన బుజ్జి ఎంట్రీ ఈవెంట్‌తో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి చేరిపోయాయి.బుజ్జి లాంచ్ ఈవెంట్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ప్రభాస్ తన కటౌట్‌కి సరిపడే బుజ్జి కారుతో స్పోర్ట్స్ రైడర్‌లా చక్కర్లు కొట్టి అభిమానులని ఆకట్టుకున్నాడు. ఆ విజువల్స్  హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. ఇక ప్రభాస్ కాస్ట్యూమ్ కూడా హాలీవుడ్ మార్వెల్ మూవీ హీరోస్ లాగే చాలా నిండుగా ఉంది.ప్రభాస్ సేఫ్టీ డ్రెస్సింగ్‌తో కనిపించి అదరగొట్టేశాడు. మరి ఈ బుజ్జి టీజర్ ఈ లెవెల్లో ఉంటే.. ట్రైలర్ ఇంకే లెవెల్లో ఉంటుందో అని ఫ్యాన్స్ అంతా కూడా చర్చించుకుంటున్నారు.అయితే ట్రైలర్ అప్డేట్ గురించే ఇప్పుడు చర్చ నడుస్తుంది.


కల్కి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అంతా కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ట్రైలర్‌కి సంబంధించి ఓ వార్త మాత్రం తెగ వైరల్ అయిపోతుంది. కల్కికి ఇప్పుడున్న రెస్పాన్స్‌ను మరింత పెంచే విధంగా ట్రైలర్‌ను మంచి యాక్షన్ మసాలా ముక్కలతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.ఇంకా అంతేకాకుండా బుజ్జి టీజర్‌కు ఏ మాత్రం తక్కువ కాకుండా ట్రైలర్‌ను ఓ రేంజ్‌లో చూపించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ డేట్‌పైనే ఇప్పుడు అందరికళ్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్‌ను వచ్చే నెల జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే సినిమా రిలీజ్‌కు రెండు వారాల ముందు విడుదల చేస్తే ఎక్కువ మందికి చేరే అవకాశముందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>