PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pinelli-rama-krishna-reddy-palandu-politics892e0658-b12b-43d1-a3dc-8e57809ee4a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pinelli-rama-krishna-reddy-palandu-politics892e0658-b12b-43d1-a3dc-8e57809ee4a4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అందరూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివాదం గురించి చర్చించుకుంటున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎలాంటి శిక్ష పడబోతుందో అని అందరూ అంటున్నారు. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రోజు అంటే మే 13వ తేదీన మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం బాక్స్లను బద్దలు కొట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. pinnelli ramakrishna reddy{#}Perni Nani;Pinnelli Ramakrishna Reddy;Murder.;Macherla;sunday;Nani;Nara Lokesh;Elections;June;MLA;Parliment;Telugu Desam Party;Assembly;Minister;Andhra Pradesh;YCPపిన్నెల్లి హత్యకు టీడీపీ కుట్ర?పిన్నెల్లి హత్యకు టీడీపీ కుట్ర?pinnelli ramakrishna reddy{#}Perni Nani;Pinnelli Ramakrishna Reddy;Murder.;Macherla;sunday;Nani;Nara Lokesh;Elections;June;MLA;Parliment;Telugu Desam Party;Assembly;Minister;Andhra Pradesh;YCPSun, 26 May 2024 13:36:17 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అందరూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివాదం గురించి చర్చించుకుంటున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎలాంటి శిక్ష పడబోతుందో అని అందరూ అంటున్నారు. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రోజు అంటే మే 13వ తేదీన మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం బాక్స్లను బద్దలు కొట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.



ఈ సందర్భంగారికార్డ్ అయిన వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. అయితే ఈ వీడియోను ఎన్నికల సంఘం విడుదల చేయాల్సింది కాగా... నారా లోకేష్ విడుదల చేసి పెద్ద రచ్చకు దారి తీశారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. వెంటనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్టు చేయాలని... ఆదేశాలు ఇచ్చింది. కానీ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.



ఈ సందర్భంగా ఆయనకు భారీ ఊరట లభించింది. జూన్ 5వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకూడదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వైసీపీ పార్టీకి అలాగే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించినట్లు అయింది. ఇలాంటి నేపథ్యంలో వైసిపి ఇదే అంశంపై కొత్త వివాదానికి తెరలేపింది. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య చేసేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపణలు చేస్తుంది వైసిపి.  దీనికి తగ్గట్టుగానే మాజీ మంత్రి పేర్ని నాని  ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు.


మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని హత్య చేసేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తుందని... దీనికి ఏపీలోని అధికారులు సహాయం చేస్తున్నారని  ఆయన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటిదగ్గర సెక్యూరిటీని కూడా తగ్గించారన్నారు. తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తున్న అధికారులను తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు పేర్ని నాని. దీంతో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>