PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani0d494cfa-b3b7-4d40-a2ea-97096e3256d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani0d494cfa-b3b7-4d40-a2ea-97096e3256d6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మే 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజు నుంచి... ఇప్పటివరకు ఏపీ ఫలితాలపై చాలామంది బెట్టింగులు కూడా కాస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో కీలక నేత... జగన్ నమ్మిన బంటు కొడాలి నాని గెలుపు పై చాలా సందేహాలు నెలకొన్నాయి. అసలు కొడాలి నాని ఈసారి గెలుస్తాడా అని అందరూ చర్చించుకుంటున్నారు. kodali nani{#}Kodali Nani;ramu;Telugu Desam Party;Amarnath Cave Temple;Survey;Jagan;Assembly;Andhra Pradesh;YCP;Parliment;Chequeకొడాలి నానికి ఓటమి టెన్షన్.. వాళ్ళే వెన్నుపోటు పొడిచారా ?కొడాలి నానికి ఓటమి టెన్షన్.. వాళ్ళే వెన్నుపోటు పొడిచారా ?kodali nani{#}Kodali Nani;ramu;Telugu Desam Party;Amarnath Cave Temple;Survey;Jagan;Assembly;Andhra Pradesh;YCP;Parliment;ChequeSun, 26 May 2024 07:39:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మే 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజు నుంచి... ఇప్పటివరకు ఏపీ ఫలితాలపై చాలామంది బెట్టింగులు కూడా కాస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో కీలక నేత... జగన్ నమ్మిన బంటు కొడాలి నాని గెలుపు పై చాలా సందేహాలు నెలకొన్నాయి. అసలు కొడాలి నాని ఈసారి గెలుస్తాడా అని అందరూ చర్చించుకుంటున్నారు.


ముఖ్యంగా వైసీపీ శ్రేణులు కూడా ఇదే టెన్షన్లో ఉన్నారట. దానంతటకీ కారణం కొడాలి నాని స్వయంకృపరాధం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు నియోజకవర్గాన్ని కొడాలి నాని సరిగా పట్టించుకోలేదని టాక్ ఉంది. అంతేకాకుండా రోడ్లు కూడా సరిగా బాగు చేయించలేదట కొడాలి నాని. సంక్షేమ పథకాలు వాలంటీర్లు ఇచ్చేయడంతో... కొడాలి నాని పేరు పాపులర్ కాలేకపోయిందని కూడా సర్వే సంస్థలు తేల్చి చెప్పాయట.


ఇక ఈ ఐదేళ్ల పాలనలో కొడాలి నాని అనుచరులు, వైసిపి కార్యకర్తలు గుడివాడ నియోజకవర్గంలో తమకు నచ్చినట్లు చేశారట. చిన్న చిన్న పంచాయతీల నుంచి.. రియల్ ఎస్టేట్ దందాల వరకు అన్ని వారే నిర్వహించారట. దీంతో కొడాలి నాని వర్గంపై నియోజకవర్గ ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా... మనకి ఎన్నికల సమయంలో కొడాలి నానిది అనుచరులే డబ్బు పంచకుండా... ఒక్కొక్కరి 50 వేల నుంచి లక్ష రూపాయలు తీసుకొని విదేశాలకు చెక్ చేశారట. ఇక... ఈసారి కొడాలి నాని కి బలమైన అభ్యర్థి బరిలో ఉండటం కూడా ఆయనకు కొత్త టెన్షన్ తీసుకువచ్చిందట.


ఈసారి కొడాలి నాని ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగండ్ల రాము బరిలో ఉన్నారు. ఆయన డబ్బు పరంగా చాలా ఖర్చు పెట్టారట. గత ఐదు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్న ఆయన తీర్చారట. అలాగే ఆయన స్థానికుడు కావడం ప్లస్ పాయింట్ అయింది. వెనుగండ్ల రాము భార్య కూడా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ప్రతి ఒక్కరిని వెనుగండ్ల రాము కలుపుకొని వెళ్లారట. ఈ అంశాల నేపథ్యంలోనే కొడాలి నాని కాస్త టెన్షన్ పడుతున్నారట. మరి ఆయన గెలుస్తారా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>