PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/allu-arjuncd2f216c-38b1-46f7-9021-6afc01da86f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/allu-arjuncd2f216c-38b1-46f7-9021-6afc01da86f7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వెంటాడుతున్నారు. అదేంటి ఏపీ పోలీసులకు అల్లు అర్జున్ కు ఏం సంబంధం అనుకుంటున్నారా ? ఉంది సంబంధం కచ్చితంగా ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ చేసిన రచ్చ కారణంగా... ఇప్పుడు అధికార యంత్రాంగం ఏపీ పోలీసులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఇద్దరు కానిస్టేబుల్ లో పై వేటు వేసింది. allu arjun{#}Nagababu;Janasena;Pawan Kalyan;Raccha;local language;shilpa;Assembly;Nandyala;Yevaru;Allu Arjun;Tollywood;Arjun;Chiranjeevi;News;Andhra Pradesh;YCP;Reddy;Heroఏపీ పోలీసులు, మెగా ఫ్యామిలీని వెంటాడుతోన్న అల్లు అర్జున్ ?ఏపీ పోలీసులు, మెగా ఫ్యామిలీని వెంటాడుతోన్న అల్లు అర్జున్ ?allu arjun{#}Nagababu;Janasena;Pawan Kalyan;Raccha;local language;shilpa;Assembly;Nandyala;Yevaru;Allu Arjun;Tollywood;Arjun;Chiranjeevi;News;Andhra Pradesh;YCP;Reddy;HeroSat, 25 May 2024 12:21:00 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వెంటాడుతున్నారు. అదేంటి ఏపీ పోలీసులకు అల్లు అర్జున్ కు ఏం సంబంధం అనుకుంటున్నారా ? ఉంది సంబంధం కచ్చితంగా ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ చేసిన రచ్చ కారణంగా... ఇప్పుడు అధికార యంత్రాంగం ఏపీ పోలీసులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఇద్దరు కానిస్టేబుల్ లో పై వేటు వేసింది.

నంద్యాల నియోజకవర్గంలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మొన్న 11వ తేదీన... అంటే సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు... వైసిపి అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేశారు. నంద్యాలలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ కుటుంబం... నంద్యాలలో వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేసింది. అయితే అల్లు అర్జున్ ప్రచారంకు రావడంతో... నంద్యాల నియోజకవర్గంలో... పక్క నియోజకవర్గాల్లో ఉన్న అతని ఫ్యాన్స్ తండోపతండాలుగా వచ్చారు.

అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ అలాగే ఓటర్లు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో భారీ జన సమీకరణ జరుగుతుందని... ఎవరు ఊహించలేదట. అలాగే నంద్యాల అల్లు అర్జున్ పర్యటన గురించి ఉన్నతాధికారులకు స్థానిక పోలీసులు కూడా చెప్పలేదట. దీంతో ఈ సంఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తాజాగా నంద్యాల కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజు లపై వేటు వేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇంకా ఈ సంఘటనపై విచారణ చేస్తోంది ఎన్నికల సంఘం. ఇక అటు వైసీపీకి హీరో అల్లు అర్జున్ ప్రచారం చేయడం మెగాస్టార్ కుటుంబంలో కూడా చీలిక తీసుకువచ్చింది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో మెగా కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తుంటే... శత్రువు అయిన వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం చేశారు. దీంతో అల్లు కుటుంబానికి అలాగే మెగాస్టార్ కుటుంబానికి మధ్య దూరం పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే నాగబాబు కూడా... మావాడు అనుకున్నాను కానీ... ప్రత్యర్ధులకు సహాయం చేస్తున్నాడని చెప్పగానే చెప్పారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>