PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-army-unremitting-services-to-the-medical-field-these-consultants-are-very-special516769f7-11f0-40b3-ae12-1c2a454f0b52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-army-unremitting-services-to-the-medical-field-these-consultants-are-very-special516769f7-11f0-40b3-ae12-1c2a454f0b52-415x250-IndiaHerald.jpg- 104, 108కు డాక్టర్‌ వెంకట్‌ చెంగవల్లి స‌ల‌హాలు - ఆరోగ్య శ్రీ స‌క్సెస్‌లో గోవింద హరి - ఢిల్లీ హెల్త్‌ అడ్వయిజర్‌గా శిల్పా చేకుపల్లి ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) ఏపీలో వైద్య రంగానికి ప్ర‌భుత్వం ఎన‌లేని ప్రాధాన్యంఇస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ వైద్య రంగాన్ని ప‌రిపుష్టం చేశామ‌న‌ని చెప్పారు. ఇలాంటి వైద్య రంగాన్ని అగ్ర‌స్థానంలో నిలిపేందుకు ప‌లువురు స‌ల‌హాదారులు కృషి చేశార‌నిచెప్ప‌డంలోఎలాంటి సందేహం లేదు. వీరిలో మొత్తం ఐదుగురు స‌ల‌హా దారులు ఉన్నారు. వైద్AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; 108; 104; jagan; ycp; ysrcp{#}Govinda;shilpa;sree;Delhi;CM;Indiaజ‌గ‌న్ సైన్యం: వైద్య రంగానికి అలుపెరుగ‌ని సేవ‌లు... ఈ స‌ల‌హాదారులు చాలా స్పెష‌ల్‌..!జ‌గ‌న్ సైన్యం: వైద్య రంగానికి అలుపెరుగ‌ని సేవ‌లు... ఈ స‌ల‌హాదారులు చాలా స్పెష‌ల్‌..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; 108; 104; jagan; ycp; ysrcp{#}Govinda;shilpa;sree;Delhi;CM;IndiaSat, 25 May 2024 10:25:27 GMT- 104, 108కు డాక్టర్‌ వెంకట్‌ చెంగవల్లి స‌ల‌హాలు
- ఆరోగ్య శ్రీ స‌క్సెస్‌లో గోవింద హరి
- ఢిల్లీ హెల్త్‌ అడ్వయిజర్‌గా శిల్పా చేకుపల్లి

( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో వైద్య రంగానికి ప్ర‌భుత్వం ఎన‌లేని ప్రాధాన్యంఇస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ వైద్య రంగాన్ని ప‌రిపుష్టం చేశామ‌న‌ని చెప్పారు. ఇలాంటి వైద్య రంగాన్ని అగ్ర‌స్థానంలో నిలిపేందుకు ప‌లువురు స‌ల‌హాదారులు కృషి చేశార‌నిచెప్ప‌డంలోఎలాంటి సందేహం లేదు. వీరిలో మొత్తం ఐదుగురు స‌ల‌హా దారులు  ఉన్నారు.  వైద్య రంగంలోని వివిధ విభాగాల‌కు వీరు త‌మ త‌మ స‌ల‌హాల‌ను అందించారు.


వీరిలో పూర్తిస్థాయి వైద్య రంగంపై దృష్టి పెట్టిన వైద్య స‌ల‌హాదారు ఒక‌రైతే.. ఇత‌ర విభాగాలైన 104, 108 ల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసే విష‌యంలో స‌ర్కారుకు స‌ల‌హాలు ఇచ్చిన‌వారు మ‌రొక‌రు. ఇక‌, ఢిల్లీలో ఉంటూ.. ప్ర‌భుత్వానికి సాయం చేసేలా స‌ల‌హాలు ఇచ్చిన వారు ఒక‌రు ఉన్నారు. ఇలా.. మొత్తంగా ఐదురుగు స‌ల‌హాదారులు.. ప్ర‌భుత్వానికి సేవ‌లు అందించారు. వీరిలో ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణులు.. నోరి ద‌త్తాత్రేయుడు.. ఒక‌రు. ఈయ‌న పూర్తివైద్య రంగం స‌ల‌హారుగా వ్య‌వ‌హ‌రించారు.


డాక్టర్‌ వెంకట్‌ చెంగవల్లి కూడా 108,104 సేవలకు కీల‌క స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించారు. ఈయ‌న వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ సేవ‌లు మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా వ్య‌వ‌హ‌రించారు. కీల‌క‌మైన స‌ల‌హాలు కూడా ఇచ్చారు. ఇక‌,  శిల్పా చేకుపల్లి, హెల్త్‌ అడ్వయిజర్‌ (ఢిల్లీ)లో ఉంటారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ఆయుష్మాన్ భారత్ వంటి ప‌థ‌కంలో రావాల్సిన అంశాల‌ను కూడా..ఆమె ప‌రిశీలిస్తూ.. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇస్తారు.


ఇక‌, కీల‌క‌మైన ఆరోగ్య శ్రీ విష‌యంలో ఎప్పటిక‌ప్పుడు గోవింద హరి స‌ల‌హాలు ఇస్తుంటారు. ప‌రిస్థితిని గ‌మ నించి.. ఎప్ప‌టిక‌ప్పుడు.. ఈయన ఆరోగ్య శ్రీని మెరుగు ప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈయ‌న సేవ‌ల ద్వారా.. ఆరోగ్య శ్రీలో మరో 20 ర‌కాల జ‌బ్బుల‌ను చేర్చ‌డం గ‌మ‌నార్మం. ఇక‌, డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, పబ్లిక్‌ హెల్త్ స‌ల‌హాదారుగా ఉన్నారు. ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల ప‌నితీరును మెరుగు ప‌రిచేందుకు ఈయ‌న ఇచ్చిన స‌ల‌హాలు ఎంత‌గానో ఉప‌క‌రించాయ‌న‌డంలో సందేహం లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>