PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/osd-krishnamohan-reddy1cb09c27-4879-4c4d-9a32-8268fde519b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/osd-krishnamohan-reddy1cb09c27-4879-4c4d-9a32-8268fde519b7-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ తనను నమ్మిన వ్యక్తులను అస్సలు వదులుకోరని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. అలా జగన్ అత్యంత నమ్మదగిన వ్యక్తులలో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఒకరు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియమితులయ్యారు. అంతకు ముందు కృష్ణమోహన్ రెడ్డి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పని చేశారు. osd krishnamohan reddy{#}devineni avinash;collector;Sakshi;marriage;CM;television;Smart phone;News;Raccha;Murder.;Reddy;media;Andhra Pradesh;Hanu Raghavapudi;Jaganజగన్ నమ్మకానికి నిలువెత్తు రూపం కృష్ణమోహన్ రెడ్డి.. ఆయనంటే ఇంత అభిమానమా?జగన్ నమ్మకానికి నిలువెత్తు రూపం కృష్ణమోహన్ రెడ్డి.. ఆయనంటే ఇంత అభిమానమా?osd krishnamohan reddy{#}devineni avinash;collector;Sakshi;marriage;CM;television;Smart phone;News;Raccha;Murder.;Reddy;media;Andhra Pradesh;Hanu Raghavapudi;JaganSat, 25 May 2024 15:30:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ తనను నమ్మిన వ్యక్తులను అస్సలు వదులుకోరని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. అలా జగన్ అత్యంత నమ్మదగిన వ్యక్తులలో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఒకరు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియమితులయ్యారు. అంతకు ముందు కృష్ణమోహన్ రెడ్డి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పని చేశారు.
 
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోన్ వాడరనే సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం జగన్ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం ఇదే విషయాన్ని ఆయన వెల్లడించారు. అయితే జగన్ ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడాలంటే తన పీఏ ఫోన్ కానీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ కానీ ఉపయోగించే వారంటే ఆయన అంటే ఎంత నమ్మకమో అర్థమవుతోంది. జగన్ నమ్మకానికి నిలువెత్తు రూపం కృష్ణమోహన్ రెడ్డి అని జగన్ సన్నిహితులు భావిస్తారు.
 
వివేకా హత్య కేసులో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కూడా సాక్షి కాగా జగన్ ఓఎస్డీ వివేకా కేసులో సాక్షి కావడంతో ఒక వర్గం మీడియా అప్పట్లో చేసిన రచ్చ అంతాఇంతా కాదు. అయితే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం వైఎస్ వివేకా బాత్రూంలో మరణించారని అవినాష్ రెడ్డి సమాచారం ఇస్తే ఆ సమాచారం జగన్ కు చెప్పానని మీడియా ముఖంగా చెప్పి నెగిటివ్ ప్రచారం చేస్తున్న పత్రికల, టీవీ ఛానెళ్ల నోర్లను కృష్ణమోహన్ రెడ్డి మూయించారు.
 
మీడియాకు కృష్ణమోహన్ రెడ్డి వీలైనంత దూరంగా ఉంటారు. అయితే తన అవసరం ఉంటే మాత్రం స్పందించడానికి ఆయన వెనుకాడరు. జగన్ నమ్మిన బంటుగా కృష్ణమోహన్ రెడ్డికి పేరుంది. మూడేళ్ల క్రితం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇంట ఆయన కొడుకు పెళ్లి వేడుక జరగగా ఆ వేడుకకు సైతం జగన్ హాజరయ్యారంటే జగన్, కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం గురించి అర్థమవుతుంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>