PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-macharal-video-leak-bigusukuntuna-uchhu97c4e032-e6b1-48d7-900c-b3c8d55a05a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-macharal-video-leak-bigusukuntuna-uchhu97c4e032-e6b1-48d7-900c-b3c8d55a05a0-415x250-IndiaHerald.jpgమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారంటూ గత కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయం పైన రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈవీఎంసీ ధ్వంసం చేశారని కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎమ్మెల్యే పైన సీరియస్ అయ్యారు. పిన్నెల్లి పైన నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.. దీనిపైన పిన్నెల్లి ముందస్తుగా బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో కోర్టు జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పోలీసులకు ఆదేశాలు జారీNARA LOKESH ;MACHARLA;PENELI RAMA KRISHNA REDDY{#}Mukesh;twitter;meena;court;Macherla;central government;MLA;Lokesh;Nara Lokesh;Lokesh Kanagaraj;YCPలోకేష్: మాచర్ల వీడియో లిక్.. బిగుసుకుంటున్న ఉచ్చు..?లోకేష్: మాచర్ల వీడియో లిక్.. బిగుసుకుంటున్న ఉచ్చు..?NARA LOKESH ;MACHARLA;PENELI RAMA KRISHNA REDDY{#}Mukesh;twitter;meena;court;Macherla;central government;MLA;Lokesh;Nara Lokesh;Lokesh Kanagaraj;YCPSat, 25 May 2024 07:53:46 GMTమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారంటూ గత కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయం పైన రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈవీఎంసీ ధ్వంసం చేశారని కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎమ్మెల్యే పైన సీరియస్ అయ్యారు. పిన్నెల్లి పైన నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.. దీనిపైన పిన్నెల్లి ముందస్తుగా  బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో కోర్టు జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టాలని ధర్మాసనం కూడా కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను తాము రిలీజ్ చేయలేదంటూ ఎన్నికల సంఘం తెలియజేసింది. అసలు ఈ వీడియో ఎలా బయటికి వచ్చిందని విషయం పైన విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా తెలియజేశారు.


అయితే ఈ వీడియో మొదట నారా లోకేష్ తన ట్విట్టర్ నుంచి షేర్ చేశారని ఈ వీడియో లీక్ వెనక లోకేష్ పాత్ర ఏదైనా ఉందా అనే విషయం పైన కూడా దర్యాప్తు చేయాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. మాచర్లలో 8 పోలింగ్ కేంద్రాలలో రెండు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లుగా తెలియజేశారు. కానీ మిగిలిన 9 ఈవిఎం లను పగలగొట్టిన వీడియో మాత్రం అసలు బయటికి రాలేదని తెలుస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగానే తొందరపడి ఈ వీడియోని విడుదల చేశారని చివరికి ఇది లోకేష్ మెడకే చుట్టుకొనేలా కనిపిస్తోందని వాదన ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>