MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pz22b0ecf8-197f-4dfb-968f-c1727ceefb93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pz22b0ecf8-197f-4dfb-968f-c1727ceefb93-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె హిందీ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రీతి కెరియర్ లో కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించింది. మొదటగా ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన రాజ కుమారుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ కి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీ మంచి విజయం సాధించడం ఇందులో ప్రీతి కూడా తన అద్భుతమైన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సిpz{#}prithy;Preity Zinta;Venkatesh;Interview;mahesh babu;BEAUTY;Heroine;Hindi;Beautiful;Telugu;Cinemaనేను ఇన్ని సంవత్సరాలు అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను... ప్రీతి జింటా..!నేను ఇన్ని సంవత్సరాలు అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను... ప్రీతి జింటా..!pz{#}prithy;Preity Zinta;Venkatesh;Interview;mahesh babu;BEAUTY;Heroine;Hindi;Beautiful;Telugu;CinemaSat, 25 May 2024 12:35:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె హిందీ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రీతి కెరియర్ లో కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించింది. మొదటగా ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన రాజ కుమారుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ కి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు.

ఇక ఈ మూవీ మంచి విజయం సాధించడం ఇందులో ప్రీతి కూడా తన అద్భుతమైన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ప్రేమంటే ఇదేరా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది.

ఈ సినిమాతో ఈమె క్రేజ్ తెలుగు లో మరింత పెరిగింది. దానితో ఈమె వరస పెట్టి తెలుగు సినిమాలలో నటిస్తుంది అని అంతా భావించారు. కానీ ఈమె ప్రేమంటే ఇదేరా సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ఇకపోతే ఈమె ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలలో కూడా నటించడం లేదు. ఈమె ఆరు సంవత్సరాల క్రితం హిందీ సినిమాలో నటించింది. ఈమె ఆఖరుగా 2018 లో విడుదలైన "బ్రదర్ సూపర్‌హిట్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ లాహోర్ 1947 లో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు సినిమాలు చేయకపోవడం పై స్పందించింది. నేను ఎన్ని సంవత్సరాల పాటు పలు వ్యాపార పనులతో బిజీగా ఉన్నాను. సినిమాలు చేయడానికి సమయం దొరకలేదు అందుకే సినిమాలు చేయలేదు అని చెప్పుకొచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>