PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/devulapalli-amar-ap-jagan-ycp-journalistc357f2fe-3856-4881-8a6a-9ea273f64de0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/devulapalli-amar-ap-jagan-ycp-journalistc357f2fe-3856-4881-8a6a-9ea273f64de0-415x250-IndiaHerald.jpg ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ప్రభుత్వాన్ని నడపడం కోసం పేద ప్రజల కష్టాలను తీర్చడం కోసం నిరంతర కృషి చేశారు చేస్తున్నారు కూడా. అలాంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకుల నుంచి మొదలు అధికారులు, సలహాదారులు కూడా చాలా సమర్థులై ఉండాలనే ఆలోచన చేశారు. దానికోసం ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సమర్థవంతమైన వ్యక్తులు ఉన్నారో వారిని గుర్తించి , వారిని తీసుకొచ్చి తన పక్కన పెట్టుకున్నాడు. వారి సలహాలు, సూచనలతో పేద ప్రజలను దారిద్ర్యం నుంచి గటDEVULAPALLI AMAR;AP;JAGAN;YCP;JOURNALIST{#}amar;madan;Warangal;eenadu;Sakshi;Yevaru;Prime Minister;Hanu Raghavapudi;Telugu;media;Andhra Pradesh;Reddy;Jagan;Telangana Chief Minister;Indianజగన్ సైన్యం:జగన్ నమ్మిన బంటు దేవులపల్లి అమర్..!జగన్ సైన్యం:జగన్ నమ్మిన బంటు దేవులపల్లి అమర్..!DEVULAPALLI AMAR;AP;JAGAN;YCP;JOURNALIST{#}amar;madan;Warangal;eenadu;Sakshi;Yevaru;Prime Minister;Hanu Raghavapudi;Telugu;media;Andhra Pradesh;Reddy;Jagan;Telangana Chief Minister;IndianSat, 25 May 2024 08:27:00 GMT- నిరంతర కృషివలుడు దేవులపల్లి
- పేదల కష్టాలపై కథనాలు రాసే వ్యక్తి.
- జర్నలిస్ట్ నుంచి  జాతీయ మీడియా అధ్యక్షుడిగా ఎదిగిన వైనం..


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తాను ప్రభుత్వాన్ని నడపడం కోసం పేద ప్రజల కష్టాలను తీర్చడం కోసం నిరంతర కృషి చేశారు చేస్తున్నారు కూడా. అలాంటి జగన్మోహన్ రెడ్డి  పేదలకు ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకుల నుంచి మొదలు అధికారులు, సలహాదారులు కూడా చాలా సమర్థులై ఉండాలనే ఆలోచన చేశారు. దానికోసం ఆయన  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సమర్థవంతమైన వ్యక్తులు ఉన్నారో వారిని గుర్తించి , వారిని తీసుకొచ్చి తన పక్కన పెట్టుకున్నాడు. వారి సలహాలు, సూచనలతో పేద ప్రజలను దారిద్ర్యం నుంచి గట్టెక్కించారు. జగన్ నమ్మిన బంట్లలో   దేవులపల్లి అమర్ కూడా ఒకరు. మరి ఆయన ఎవరు అనే వివరాలు చూద్దాం.. చాలామందికి దేవులపల్లి అనే పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాలలోని  దేవులపల్లి రామానుజరావు గుర్తుకొస్తారు.  పండితులుగా మంచి పేరు పొందారు. నిజాం పరిపాలన కాలంలో గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించారు రామానుజ రావు.

వరంగల్ జిల్లాలో ఎంతో పేరు ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ  అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుతో  కలిసి శోభ అనే పత్రికను కూడా నడిపారట. అలాగే కాకతీయ పత్రిక అనే కొత్త పత్రికను కూడా తీసుకువచ్చి అప్పట్లో  సరికొత్తగా ప్రజలకు సమాచారాన్ని అందించేవారు. ఆ విధంగా  అమర్ పూర్వీకుల నుంచి  రచయితలుగా పత్రికా రంగంలో అనుభవం ఉన్న వారిగా పేరుపొందుతూ వచ్చారు. అంతే కాకుండా దేవులపల్లి అమర్ తండ్రి మదన్ మోహన్ రావు కూడా పత్రికా రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులే. ఈ విధంగా స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అమర్ కుటుంబీకులంతా పాల్గొని ఎంతో కృషి చేశారు. వారి యొక్క ఆలోచన అనుభవాన్ని సంతరించుకొని దేవులపల్లి అమర్ కూడా పత్రికా రంగంలో అంచలంచెలుగా ఎదిగారు. రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి అమర్ 16 వ ఏటనే జర్నలిజంలో అడుగు పెట్టారు. ఇక 19వ వేట క్రియాశీలక జర్నలిస్టుగా మారారు. ప్రజాతంత్ర ద్వారా తన జర్నలిజం ఫీల్డ్ మొదలుపెట్టినటువంటి అమర్, ఆ తర్వాత ఈనాడు పత్రికలో ట్రైనింగ్ తీసుకోని సబ్ ఎడిటర్ గా  చేరిన అమర్  ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఆ విధంగా జర్నలిస్టు ఫీల్డ్ లో ఎన్నో అద్భుతమైన కథనాలు రాస్తూ మంచి గుర్తింపు పొందినటువంటి దేవులపల్లి అమర్  ఆంధ్రభూమి, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి దిన పత్రికల్లో కూడా పనిచేశారు.  ఆ తర్వాత సాక్షి టీవీలో చేరి సమకాలీన రాజకీయాలపై లైవ్ షో నిర్వహిస్తూ ప్రజల్లో ఎంతో ఆదరణ పొందారు.  ఈ విధంగా ఆయన రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రెండుసార్లు బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు అధ్యక్షుడిగా కూడా  చేశారు. ఈ విధంగా జగన్ చేసే కార్యక్రమాలపై, అభివృద్ధి పనులపై ఈయన ఎన్నో విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు. ఆయన టాలెంటును గుర్తించినటు వంటి జగన్  2019 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా వ్యవహారాల సలహాదారుడుగా నియమించుకున్నారు. అలా దేవులపల్లి అమర్  సలహాలు,సూచనలతో  అద్భుతమైన పథకాలతో ప్రజలకు పాలన అందేలా చేశాడని చెప్పవచ్చు. దీంతో ఆయన ఇప్పటికీ జగన్ వెంటే ఉంటూ  ఆయన చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓవైపు రాజకీయ విశ్లేషకులుగా, మరోవైపు రచయితగా కొనసాగుతున్నారని చెప్పవచ్చు. ఈ విధంగా జగన్ నమ్మినబంటుగా దేవులపల్లి అమర్ మంచి గుర్తింపు సాధించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>