PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-eb746f59-d7dc-445c-b59d-9f2ce487834d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-eb746f59-d7dc-445c-b59d-9f2ce487834d-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ తమకంటూ సెపరేట్‌గా ఒక ట్రెడిషనల్ ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. ఈ పార్టీల నేతలు చెప్పినా చెప్పకపోయినా ఆ వోట్ బ్యాంకు ఎవరికి పడాలో వారికి పడుతుంది. ఉదాహరణకి కాంగ్రెస్‌కు 100 మంది ప్రజల ఓటు బ్యాంక్ కలిగి ఉంటే ఆ వంద మంది ఓట్లు కాంగ్రెస్‌కే పడిపోతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ కాంగ్రెస్‌కే ఓటు వేసేవారు. అయితే ఆ ఓటు బ్యాంకును ఇప్పుడు వైసీపీ తమవైపు తిప్పుకుంది. అంటే ఈ వర్గాల ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్Chandrababu {#}Scheduled caste;Y. S. Rajasekhara Reddy;Deputy Chief Minister;Bank;Sharmila;anil music;CBN;TDP;Jagan;Scheduled Tribes;Congress;Bharatiya Janata Party;Telugu Desam Party;YCP;Andhra Pradeshఏపీ: తన గొయ్యి తానే తవ్వుకున్న చంద్రబాబు.. వారిచ్చిన షాక్ తో గిలగిల..?ఏపీ: తన గొయ్యి తానే తవ్వుకున్న చంద్రబాబు.. వారిచ్చిన షాక్ తో గిలగిల..?Chandrababu {#}Scheduled caste;Y. S. Rajasekhara Reddy;Deputy Chief Minister;Bank;Sharmila;anil music;CBN;TDP;Jagan;Scheduled Tribes;Congress;Bharatiya Janata Party;Telugu Desam Party;YCP;Andhra PradeshSat, 25 May 2024 14:25:00 GMTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ తమకంటూ సెపరేట్‌గా ఒక ట్రెడిషనల్ ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. ఈ పార్టీల నేతలు చెప్పినా చెప్పకపోయినా ఆ వోట్ బ్యాంకు ఎవరికి పడాలో వారికి పడుతుంది. ఉదాహరణకి కాంగ్రెస్‌కు 100 మంది ప్రజల ఓటు బ్యాంక్ కలిగి ఉంటే ఆ వంద మంది ఓట్లు కాంగ్రెస్‌కే పడిపోతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ కాంగ్రెస్‌కే ఓటు వేసేవారు. అయితే ఆ ఓటు బ్యాంకును ఇప్పుడు వైసీపీ తమవైపు తిప్పుకుంది. అంటే ఈ వర్గాల ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు.

జగన్ ఆ వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేశారు ముందుగా డిప్యూటీ సీఎం పదవులను ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల నేతలకే అందజేశారు. అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల వారికి ఆయన డిప్యూటీ సీఎం పదవులను అప్పచెప్పారు. చంద్రబాబు మాత్రం బీసీ, కాపు వర్గాల వారికి మాత్రమే ఈ పదవిని పరిమితం చేశారు. ప్రతి పదవిలో కూడా ఇలాగే అన్ని కులాల వారికి మంచి పదవులు హోదాలను కల్పిస్తూ వచ్చారు. కార్పొరేషన్ లెవెల్లో కూడా సమానత్వాన్ని కనబరిచారు.

ఎస్సీ కులాలలో ఎవరినైతే మిగతా ప్రభుత్వాలు పక్కన పెట్టాయో వారందరినీ జగన్ అక్కున చేర్చుకున్నారు. ప్రతి కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ షర్మిల కాంగ్రెస్ వైసీపీ నుంచి  ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల వారిని దూరం చేయాలని చూసింది. చంద్రబాబు షర్మిల చాలా ప్రయత్నాలు చేశారు. షర్మిల భర్త అనిల్ కూడా రంగంలోకి దిగి ఎస్సీ కులాల వారిని క్రిస్టియన్స్‌ను తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఒకప్పుడు మాదిగ సామాజిక వర్గం టీడీపీ వారి వైపే ఉండేవారు కానీ ఈసారి వారు కూడా టీడీపీకి దూరమయ్యారు. ఎందుకంటే టీడీపీ పొత్తు కుదుర్చుకున్న బీజేపీ మైనారిటీ, ఎస్సీ ఎస్టీ కులాలకు రిజర్వేషన్లు తీసేస్తామని ప్రకటించింది. రిజర్వేషన్లను తీసేస్తాం అనగానే ముస్లింలతో సహా రిజర్వేషన్లు పొందుతున్న కులాల ప్రజలందరూ టిడిపికి దూరమయ్యారు. సో మొత్తం మీద చూసుకుంటే వైసీపీ వైపు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రజలు ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. బీజేపీ పొత్తు కుదుర్చుకోవడం చంద్రబాబు తన గొయ్యి తానే తీసుకున్నట్లు అయింది. ఈ సామాజిక వర్గ ప్రజలందరూ ఆయనకు ఈసారి భారీగానే షాక్ ఇచ్చినట్లున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>