PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-86eb839b-1a07-46b6-938e-d14c54215438-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-86eb839b-1a07-46b6-938e-d14c54215438-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ప్రజలంతా జూన్ 4 గురించే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. కాగా ఈ సారి పోలింగ్ లో ఒక కీలక డెసిషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అదేంటంటే పోస్టల్ బ్యాలెట్ ని మొదట లెక్కించడం. ఎప్పుడూ అదే జరుగుతుంది కానీ ఈసారి మరింత పకడ్బందీగా దీని మీద ఈసీ దృష్టి పెట్టబోతోంది. కారణం ఏమిటంటే కొన్ని జిల్లాలలో నూరు శాతం ఓటింగ్ నమోదు అయింది. దాంతో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టడానికి ప్రత్యేకంగా టేబిల్స్ వేసి మరీ ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏtdp {#}workers;Survey;Indian Postal Service;Election Commission;TDP;June;Andhra Pradeshఏపీ: టీడీపీకే అత్యధిక ఆధిక్యం అంటున్న తొలి ట్రెండ్స్?ఏపీ: టీడీపీకే అత్యధిక ఆధిక్యం అంటున్న తొలి ట్రెండ్స్?tdp {#}workers;Survey;Indian Postal Service;Election Commission;TDP;June;Andhra PradeshSat, 25 May 2024 12:22:00 GMTరాష్ట్ర ప్రజలంతా జూన్ 4 గురించే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. కాగా ఈ సారి పోలింగ్ లో ఒక కీలక డెసిషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అదేంటంటే పోస్టల్ బ్యాలెట్ ని మొదట లెక్కించడం. ఎప్పుడూ అదే జరుగుతుంది కానీ ఈసారి మరింత పకడ్బందీగా దీని మీద ఈసీ దృష్టి పెట్టబోతోంది. కారణం ఏమిటంటే కొన్ని జిల్లాలలో నూరు శాతం ఓటింగ్ నమోదు అయింది. దాంతో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టడానికి ప్రత్యేకంగా టేబిల్స్ వేసి మరీ ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏకంగ 5 లక్షల దాకా పోస్టల్ బ్యాలెట్ పోల్ అయింది అని అంటున్నారు.

మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తరువాతనే సాధారణ ఓట్లను లెక్క పెట్టనున్నట్టు తెలుస్తోంది. కాగా పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ శాతం టీడీపీ కూటమికి అని అనధికారికంగా ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ కార్మికులు ఇంకా అనేకమంది సర్కార్ మీద ఆగ్రహంగానే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేశారు అని అంటున్నారు. ఇదే జరిగితే మాత్రం వైసీపీకి బిగ్ షాక్ తగలనుందని అంటున్నారు. ఇక ఒక ప్రముఖ సర్వే సంస్థ విశ్లేషకుడి అంచనా ప్రకారం చూస్తే నూటికి డెబ్బై అయిదు శాతం ఓట్లు కూటమికి పడ్డాయని సమాచారం.

అవును, దాదాపుగా నూటికి తొంబై ఐదు శాతం నియోజకవర్గాల్లో టీడీపీ అత్యధిక ఆధిక్యతను గట్టిగా చాటి చెబుతుందని అంటున్నారు తొలి ట్రెండ్స్ సర్వేలు. ఒక్కో జిల్లాలో సగటున ఏకంగా ముప్పై వేల దాకా పోస్టల్ బ్యాలెట్ పడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే నూటికి డెబ్బై అయిదు శాతం ఓట్లు కూటమికి పడినట్టు ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల వేయి అయిదు వందల ఓట్లతో కనుక గెలుపు ఓటములు సాగితే మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ అలాంటిచోట్ల ఫలితాన్ని డిసైడ్ చేసితీరుతుంది అని అంటున్నారు. ఆ విధంగా మొత్తానికి తుదిఫలితాలను చేంజ్ చేసే సత్తా ఈసారి పోస్టల్ బ్యాలెట్ కే ఉందని నమ్ముతున్నాయి చాలా సర్వేలు. మొత్తంగా అసలు ఫలితాల్లో అనుకున్నట్టు కూటమి జోరు ప్రదర్శిస్తే మాత్రం ఏపీ రాజకీయం టోటల్ చేంజ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అని అంటున్నారు విశ్లేషకులు. ఇక చూడాలి మరి ఏమి జరుగుతుందో. మీరేమంటుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు ఇక్కడ కామెంట్స్ రూపంలో తెలియజేయండి!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>