MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఆగష్టు 15న విడుదల కావలసి ఉన్న ‘పుష్ప 2’ విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఈ మూవీ మేకర్స్ నుండి వస్తున్న లీకులతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ‘పుష్ప 2’ కు పోటీగా మరొక సినిమాను విడుదల చేయడానికి ఎవరు సాహసించడంలేదు. అయితే కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ మాత్రం ‘పుష్ప 2’ మ్యానియాను లెక్కచేయకుండా తాను కూడ ఆగష్టు 15 రేసులో ఉండబోతున్నాను అంటూ లీకులు ఇస్తూ ఉండటంతో రాబోతున్న ఆగష్టు 15కు బన్నీ శివరాజ్ కుమార్ ల మధ్య వార్ తప్పక పోవచ్చు అన్న సందేహాలు వస్తున్నాయి. వాస్తవానికి బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవగనalluarjun{#}shivaraj kumar;Kumaar;Kannada;Remake;Allu Arjun;Tollywood;Hero;bollywood;December;war;August;Yevaru;Telugu;India;Prabhas;Cinemaఅల్లు అర్జున్ మ్యానియాను లెక్కచేయని శివరాజ్ కుమార్ !అల్లు అర్జున్ మ్యానియాను లెక్కచేయని శివరాజ్ కుమార్ !alluarjun{#}shivaraj kumar;Kumaar;Kannada;Remake;Allu Arjun;Tollywood;Hero;bollywood;December;war;August;Yevaru;Telugu;India;Prabhas;CinemaFri, 24 May 2024 10:00:00 GMTఆగష్టు 15న విడుదల కావలసి ఉన్న ‘పుష్ప 2’ విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఈ మూవీ మేకర్స్ నుండి వస్తున్న లీకులతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ‘పుష్ప 2’ కు పోటీగా మరొక సినిమాను విడుదల చేయడానికి ఎవరు సాహసించడంలేదు. అయితే కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ మాత్రం ‘పుష్ప 2’ మ్యానియాను లెక్కచేయకుండా తాను కూడ ఆగష్టు 15 రేసులో ఉండబోతున్నాను అంటూ లీకులు ఇస్తూ ఉండటంతో రాబోతున్న ఆగష్టు 15కు బన్నీ శివరాజ్ కుమార్ ల మధ్య వార్ తప్పక పోవచ్చు అన్న సందేహాలు వస్తున్నాయి.



వాస్తవానికి బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవగన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ తో పోటీ పడుతుంది అంటూ అనేక గాసిప్పులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు దక్షిణాది ప్రాంతానికి చెందిన తెలుగు తమిళ కన్నడ భాషలలొ కూడ ‘పుష్ప 2’ ను డబ్ చేసి అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తారు అని అంటున్నారు.



అయితే ఈ విషయాలను పట్టించికోకుండా శివరాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భైరతి రణగల్’ ఆగష్టు 15న విడుదల కాబోతోంది. ఈ మూవీ కన్నడంలో బ్లాక్ బష్టర్ హిట్ అయిన ‘మఫ్టీ’ కి కొనసాగింపు అని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనేకమంది నిర్మాతలు ప్రయతించినప్పటికీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు అని అంటారు.



గతంలో ‘పుష్ప’ విడుదల అవుతున్నప్పుడు ఆమూవీ క్రేజ్ ను లెక్కచేయకుండా అనేక బాలీవుడ్ సినిమాలు వచ్చాయి. అంతేకాదు ప్రభాస్ నటించిన ‘సలార్’ మ్యానియాను లెక్కచేయకుండా గత డిసెంబర్ లో విడుదలైన మొహన్ లాల్ నటించిన ‘నేరు’ మళయాళంలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ తనకు రిపీట్ అవుతుందని కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ భావిస్తున్నాడనుకోవాలి..  











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>