PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-jagan-ys-jagan-ycpfe026e75-d5ee-40ce-b9be-e65a2a8b6e2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-jagan-ys-jagan-ycpfe026e75-d5ee-40ce-b9be-e65a2a8b6e2c-415x250-IndiaHerald.jpg- ఏక‌తాటిమీద‌కు అధికారులు... ఎమ్మెల్యేలు - క‌లెక్ట‌ర్లు... ప్ర‌జాప్ర‌తినిధుల‌కు గ్యాప్ త‌గ్గించిన జ‌గ‌న్‌ - స‌మాన గౌర‌వం.. స‌మాన ప‌నితో వైసీపీ ప్ర‌భుత్వం స‌క్సెస్‌ ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) ప్ర‌భుత్వంతో క‌లివిడిగా ఉండే క‌లెక్ట‌ర్లు చాలా వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటారు. ఎందుకంటే.. అధికారులుగా త‌మ‌కు తెలిసినంత .. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి తెలియ‌ద‌నే విధంగా క‌లెక్ట‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తారు. ఇది.. రాజ కీయంగా.. క‌లెక్ట‌ర్ల‌కు-నాయ‌కుల‌కు మ‌ధ్య గ్యాప్ పెంచుతుంది. ఇది ఎక్క‌డైనా స‌హ‌జంగానే సాగే ప్ర‌క్రియ‌.AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; ycp{#}Amaravathi;YCP;India;CMజ‌గ‌న్ బ‌ల‌గం: క‌లెక్ట‌ర్లు - ప్ర‌జాప్ర‌తినిధులు.. ఇదో రికార్డ్‌...!జ‌గ‌న్ బ‌ల‌గం: క‌లెక్ట‌ర్లు - ప్ర‌జాప్ర‌తినిధులు.. ఇదో రికార్డ్‌...!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; ycp{#}Amaravathi;YCP;India;CMFri, 24 May 2024 09:46:58 GMT- ఏక‌తాటిమీద‌కు అధికారులు... ఎమ్మెల్యేలు
- క‌లెక్ట‌ర్లు... ప్ర‌జాప్ర‌తినిధుల‌కు గ్యాప్ త‌గ్గించిన జ‌గ‌న్‌
- స‌మాన గౌర‌వం.. స‌మాన ప‌నితో  వైసీపీ ప్ర‌భుత్వం స‌క్సెస్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ప్ర‌భుత్వంతో క‌లివిడిగా ఉండే క‌లెక్ట‌ర్లు చాలా వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటారు. ఎందుకంటే.. అధికారులుగా త‌మ‌కు తెలిసినంత .. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి తెలియ‌ద‌నే విధంగా క‌లెక్ట‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తారు. ఇది.. రాజ కీయంగా.. క‌లెక్ట‌ర్ల‌కు-నాయ‌కుల‌కు మ‌ధ్య గ్యాప్ పెంచుతుంది. ఇది ఎక్క‌డైనా స‌హ‌జంగానే సాగే ప్ర‌క్రియ‌. అయితే.. దీనివ‌ల్ల జిల్లాలకు అభివృద్ది ప‌థ‌కాలు అంద‌డంలోనూ.. అభివృద్ది జ‌ర‌గ‌డంలోనూ అనేక ఇబ్బందులు వ‌స్తున్నాయి.


దేశ‌వ్యాప్తంగా కూడా ఇదే  స‌మ‌స్య ఉంది. దీనిని గ‌మ‌నించిన ప్ర‌భుత్వాలు అనేక స‌ర్దు బాటు చ‌ర్య‌ల‌కు దిగిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. కొన్ని చోట్ల ప‌రిస్తితి బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రికొన్ని చోట్ల మాత్రం ప‌రిస్థితి అంత‌స‌రికాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో ప‌రిస్థితిని అంచ‌నా వేస్తే.. జ‌గ‌న్ స‌ర్కారు వ‌చ్చి న త‌ర్వాత‌.. ఏపీలో రాజ‌కీయ నేత‌ల‌కు-క‌లెక్ట‌ర్లకు మ‌ధ్య ఉన్న సంబంధాల విష‌యంలో ప‌రిస్థితి కొంత మెరుగు ప‌డింది.


సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా జోక్యం చేసుకుని.. మంత్రులు స‌రే.. ఎమ్మెల్యేల‌ను కూడా క‌లెక్ట‌ర్ల‌కు న‌వ్వుతూ ప‌ల క‌రించాల‌ని.. వారి స‌మ‌స్య‌లు కూడా ఓపిక‌గా వినాల‌ని ప‌దే ప‌దే చెప్పిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. క్షేత్ర‌స్థాయిలో ఒక క‌లెక్ట‌ర్ పాల‌న సాగించే జిల్లాల్లో ఒక‌పార్ల‌మెంటు స‌భ్యుడు స‌హా.. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. అంద‌రికీ స‌మాన ప్రాతిప‌దిక‌న వాల్యూ ఇవ్వాల‌ని.. అంద‌రినీ గౌర‌వించాల‌ని కూడా.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. దీనిని ఆసాంతం పాటించేలా చూశారు.


ఫ‌లితంగా రాష్ట్రంలో భిన్న‌మైన ప‌రిస్థితి ఉంది. ఇక్క‌డ క‌లెక్ట‌ర్ల‌కు-ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మ‌ధ్య గ్యాప్ త‌గ్గి.. ప్రజల‌కు మేలు చేసే క్ర‌మంలో అనేక సంస్క‌ర‌ణ‌లు వ‌చ్చాయి. విలేజ్ సెక్ర‌టేరియెట్, వార్డు స‌చివాలయాలు వంటివి వ‌చ్చాయి. ఇది ప్ర‌జాప్ర‌తినిధులు క‌లెక్ల‌ర్ల స‌మ‌న్వ‌యంతోనే సాధ్య‌మైంద‌నేది వాస్త‌వం. దీనిని సాధించ‌డంలో సీఎంగా జ‌గ‌న్ సంపూర్ణంగా స‌క్సెస్ అయ్యారు. క‌లెక్ట‌ర్లు - ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చారు. ఇది.. జ‌గ‌న్ సాధించిన స‌క్సెస్‌గానే చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>