PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawanklayan-pitapuramfde34f0e-844a-4959-a91d-47c137c015fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawanklayan-pitapuramfde34f0e-844a-4959-a91d-47c137c015fb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పిఠాపురం ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది.. ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఈసారి పవన్ గెలుస్తాడా లేదా అనే విషయం పైన కూడా జోరుగా చర్చ జరుగుతూ ఉండడంతో పాటు బెట్టింగ్ కూడా భారీగానే జరుగుతోందట. ముఖ్యంగా అక్కడ వైసిపి నేత వంగా గీత పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండడంతో అక్కడ టిడిపి ఇన్చార్జ్ వర్మ కూడా స్థానికంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చారు. నియోజవర్గంలో ప్రజలకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు ఇటీPAWANKLAYAN;PITAPURAM{#}Nani;geetha;kalyan;Janasena;pithapuram;monday;Ram Gopal Varma;TDP;News;YCPపవన్: పిఠాపురంలో మారుతున్న సీన్.. ఓటమికి సాక్ష్యం ఇదే..!పవన్: పిఠాపురంలో మారుతున్న సీన్.. ఓటమికి సాక్ష్యం ఇదే..!PAWANKLAYAN;PITAPURAM{#}Nani;geetha;kalyan;Janasena;pithapuram;monday;Ram Gopal Varma;TDP;News;YCPFri, 24 May 2024 19:03:00 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పిఠాపురం ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది.. ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఈసారి పవన్ గెలుస్తాడా లేదా అనే విషయం పైన కూడా జోరుగా చర్చ జరుగుతూ ఉండడంతో పాటు బెట్టింగ్ కూడా భారీగానే జరుగుతోందట. ముఖ్యంగా అక్కడ వైసిపి నేత వంగా గీత పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండడంతో అక్కడ టిడిపి ఇన్చార్జ్ వర్మ కూడా స్థానికంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చారు.


నియోజవర్గంలో ప్రజలకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు ఇటీవలే జనసేన నాయకుడు చొప్పల నాని మరణించడంతో పవన్ ఆదేశాల మేరకు సోమవారం రోజున నాని కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. గతంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నిలబడి ఓడిపోయారు. ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అక్కడ 90 వేలకు పైగా కాపు ఓటర్లు ఉండడంతో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసినట్లు సమాచారం. పవన్ అభిమానులు మాత్రం పిఠాపురంలో ఆయన మెజారిటీ ఎంత ఉంటుంది అనే విషయం పైన చర్చలు జరుపుతున్నప్పటికీ..


ముఖ్యంగా అక్కడ గెలవడం అంత సులువైన విషయం కాదు. పోలింగ్ తర్వాత రెండు రోజులు లక్ష మెజారిటీ అన్న జనసేన ఇప్పుడు దాదాపుగా పదివేల నుంచి 20వేల మెజారిటీకి పడిపోయారని తెలుస్తోంది. బూతుల వారీగా ఓట్లు లెక్కలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలు అని అభిప్రాయం కూడా ఏర్పడిందట. 90 వేల కాపు ఓట్లు ఉన్నప్పటికీ యూత్ అంతా పవన్ కి ఓటు వేసిన మధ్య వయసు మహిళా ఓట్లు మాత్రం కచ్చితంగా వంగా గీత గారికి పడ్డట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద నియోజకవర్గంలో 232 ఓట్లలో 1,80,000 కోట్లు ఉండగా కచ్చితంగా లక్ష  ఓట్లు గీతాకు వస్తాయని వైసిపి చాలా బలంగా నమ్ముతోంది. మరి పైకి జనసేన గంభీరంగా ఉన్న గ్రౌండ్ లెవెల్ వేరే లాగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>