PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pinnelli-effect-macharlalo-ekagreevamenac5db1e1e-8bf9-4220-bab8-0f73f907522e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pinnelli-effect-macharlalo-ekagreevamenac5db1e1e-8bf9-4220-bab8-0f73f907522e-415x250-IndiaHerald.jpgగత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటనకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశాడని, అలాగే అడ్డుకొనడానికి వచ్చిన వారిని కూడా బెదిరించినట్టు మనకు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన వారం రోజుల వరకు ఈ విషయం బయటకు రాలేదు. కానీ వారం తర్వాత ఇది సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కేవలం ఈసీ దగ్గర ఉండే ఈ వీడియో ఎలా బయటకు వచ్చPINNELLI RAMAKRISHNA REDDY;JULAKANTI BRAHMANANDAREDDY;MACHARLA;AP;YCP;TDP;EC{#}central government;Pinnelli Ramakrishna Reddy;Election Commission;MLA;Macherla;TDP;Delhi;YCPపిన్నెల్లి ఎఫెక్ట్: మాచర్లలో ఏకగ్రీవమేనా..?పిన్నెల్లి ఎఫెక్ట్: మాచర్లలో ఏకగ్రీవమేనా..?PINNELLI RAMAKRISHNA REDDY;JULAKANTI BRAHMANANDAREDDY;MACHARLA;AP;YCP;TDP;EC{#}central government;Pinnelli Ramakrishna Reddy;Election Commission;MLA;Macherla;TDP;Delhi;YCPFri, 24 May 2024 07:27:08 GMTగత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో  ఎక్కడ చూసినా  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటనకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి  రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లోకి వెళ్లి  ఈవీఎంలను ధ్వంసం చేశాడని, అలాగే అడ్డుకొనడానికి వచ్చిన వారిని కూడా బెదిరించినట్టు మనకు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన వారం రోజుల వరకు ఈ విషయం బయటకు రాలేదు. కానీ వారం తర్వాత ఇది సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కేవలం ఈసీ దగ్గర ఉండే ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది అనే దానిపై  పిన్నెల్లి  వర్గం వారు ఆరోపిస్తున్నారు. 

టిడిపి వర్గం వారు వైసీపీ అభ్యర్థి అరాచకంగా ఈవీఎంలను పగలగొట్టారని, ఓటమి భయంతోనే ఇలా చేశారని ఆయనను అరెస్టు చేయాలని, అలాగే పోర్టీలోంచి తీసేసి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. దీంతో సీరియస్ అయినటువంటి కేంద్ర ఎలక్షన్ కమిషన్ పిన్నెల్లిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో అలజడులు మొదలయ్యాయి.  అలాంటి ఈ తరుణంలో మాచర్ల నియోజకవర్గ ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించాలనే వాదన కూడా ప్రజల నుండి వినిపిస్తోంది. టిడిపి నుంచి పోటీ చేసిన అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి  ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పోలింగ్ బూత్ లో  అరాచకాలు సృష్టించిన పిన్నెల్లిని పక్కన పెట్టాలని కోరారట. ఇక ఇదే విషయమై మాజీ ఐఏఎస్ అధికారులు కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది.

ఇక్కడ ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  స్వయంగా ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు  అక్కడి అధికారులను బెదిరింపులకు గురి చేశాడని చెబుతున్నారు.  దీనిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తుందట. ఈవీఎంలను ధ్వంసం చేసిన అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటిస్తే, రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థు ఎమ్మెల్యేగా గెలిచినట్టే. ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా ఇక జరగావని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తుందని తెలుస్తోంది. మరి దీనికి  నిబంధనలు ఒప్పుకుంటాయా..న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయా.?అనే దానిపై కూడా ఆలోచన చేయాల్సి ఉంది. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ వర్గాల్లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>