MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth7d3e6d2e-8e29-4770-8ad6-4e170695c60f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth7d3e6d2e-8e29-4770-8ad6-4e170695c60f-415x250-IndiaHerald.jpgరెండు రోజుల క్రితం బెంగళూరులో ఒక ప్రముఖ వ్యక్తి పుట్టిన రోజు జరగడంతో భారీ ఎత్తున ఒక రేవ్ పార్టీని నిర్వహించినట్లు అందులో మద్యంతో పాటు డ్రగ్స్ కూడా వినియోగించినట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇక ఈ రేవ్ పార్టీ లో తెలుగు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు అందులో నటి హేమ , శ్రీకాంత్ కూడా ఉన్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. దానితో మొదటగా నటి హేమ నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు అని ఒక వీడియోను విడుదల చేసింది. కాకపోతే ఈమె రేవ్ పా ర్టీలో పాల్గొంది అని , ప్రస్తుతం పోలీసుల కస్టడీ లోనే ఉండి వీడియోను విడుదల చేసింsrikanth{#}hema;srikanth;Drugs;Yevaru;Party;News;Teluguఅనవసరపు విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తే అస్సలు ఊరుకోను... శ్రీకాంత్..!అనవసరపు విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తే అస్సలు ఊరుకోను... శ్రీకాంత్..!srikanth{#}hema;srikanth;Drugs;Yevaru;Party;News;TeluguFri, 24 May 2024 16:15:00 GMTరెండు రోజుల క్రితం బెంగళూరులో ఒక ప్రముఖ వ్యక్తి పుట్టిన రోజు జరగడంతో భారీ ఎత్తున ఒక రేవ్ పార్టీని నిర్వహించినట్లు అందులో మద్యంతో పాటు డ్రగ్స్ కూడా వినియోగించినట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇక ఈ రేవ్ పార్టీ లో తెలుగు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు అందులో నటి హేమ , శ్రీకాంత్ కూడా ఉన్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. దానితో మొదటగా నటి హేమ నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు అని ఒక వీడియోను విడుదల చేసింది.

కాకపోతే ఈమె రేవ్ పా ర్టీలో పాల్గొంది అని , ప్రస్తుతం పోలీసుల కస్టడీ లోనే ఉండి వీడియోను విడుదల చేసింది అని వారు తెలియజేశారు. ఈమెకు డ్రగ్స్ టెస్టు లో పాజిటివ్ కూడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ఆ తర్వాత నటుడు శ్రీకాంత్ నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు , అనవసరంగా నాపై వార్తలు రాస్తున్నారు. నేను ఇంట్లోనే నా కుటుంబంతో హైదరాబాదులో ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు ఆ న్యూస్ చూసినప్పుడు నవ్వారు. మీరు రాయడంలో తప్పులేదు. చూపించిన వీడియోలో ఒకరు నాలాగే ఉన్నారు.

అందుకే మీరు పొరబడినట్టు ఉన్నారు. కానీ అది నేను కాదు. ఇక పై ఇలాంటి వార్తలు రాయకండి అని చెప్పారు. ఇకపోతే మళ్లీ కూడా అలాంటి వార్తలు బయటికి రావడంతో శ్రీకాంత్ తాజాగా సీరియస్ అయ్యారు. తాజాగా శ్రీకాంత్ మాట్లాడుతూ ... తాను రేవ్ పార్టీలో ఉన్నానంటూ దుష్ప్రచారం చేస్తే ఊరుకోను అని శ్రీకాంత్ హెచ్చరించారు. తనకు సంబంధం లేని విషయాలలో నన్ను ఇన్వాల్వ్ చేస్తే నోటీసులు జారీ చేస్తాను అని తెలిపారు. నేను ఫ్యామిలీ మెన్  ,తనపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. నిజంగా ఆ పార్టీలో ఎవరు ఉన్నారో తెలుసుకొని వాళ్లని వదిలిపట్టొద్దని సూచించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>