PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/konatala-krishnab37a2692-5b33-46ab-890f-0e723680e224-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/konatala-krishnab37a2692-5b33-46ab-890f-0e723680e224-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ప్రధాన పార్టీల నేతలు, ఆ పార్టీల అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ గెలిచినా 100 కంటే తక్కువ సీట్లతోనే అధికారంలోకి వస్తుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా సత్తా చాటడం ఖాయమని ప్రచారం జరుగుతుండగా జనసేన కచ్చితంగా గెలిచే నియోజకవర్గం ఏదనే ప్రశ్నకు అనకాపల్లి పేరు సమాధానంగా వినిపిస్తోంది.konatala krishna{#}bharath;Jr NTR;ramakrishna;Amarnath Cave Temple;Sri Bharath;Anakapalle;Andhra Pradesh;Party;Janasena;YCPఅనకాపల్లిలో జనసేనకు తిరుగులేదా.. కొణతాల రామకృష్ణ మెజార్టీ లెక్కలివే!అనకాపల్లిలో జనసేనకు తిరుగులేదా.. కొణతాల రామకృష్ణ మెజార్టీ లెక్కలివే!konatala krishna{#}bharath;Jr NTR;ramakrishna;Amarnath Cave Temple;Sri Bharath;Anakapalle;Andhra Pradesh;Party;Janasena;YCPThu, 23 May 2024 07:40:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ప్రధాన పార్టీల నేతలు, ఆ పార్టీల అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ గెలిచినా 100 కంటే తక్కువ సీట్లతోనే అధికారంలోకి వస్తుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా సత్తా చాటడం ఖాయమని ప్రచారం జరుగుతుండగా జనసేన కచ్చితంగా గెలిచే నియోజకవర్గం ఏదనే ప్రశ్నకు అనకాపల్లి పేరు సమాధానంగా వినిపిస్తోంది.
 
అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి తరపున కొణతాల రామకృష్ణ పోటీ చేస్తుండగా వైసీపీ తరపున మలసాల భరత్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో రామకృష్ణదే విజయమని కనీసం పదివేల మెజార్టీతో అనకాపల్లిలో రామకృష్ణ విజయం సాధిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థానంపై వైసీపీ చాలా ఆశలు పెట్టుకున్నా గెలిచే అవకాశాలు అయితే లేని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
కొణతాల రామకృష్ణకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండగా మలసాల భరత్ మాత్రం యువకుడు కావడం గమనార్హం. సీనియర్, జూనియర్ హోరాహోరీ పోరులో జనసేన సత్తా చాటడం పక్కా అని తెలుస్తోంది. అనకాపల్లి నియోజకవర్గంలో 2 లక్షల కంటే ఎక్కువమంది ఓటర్లు ఉండగా ఇప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
 
కొణతాల రామకృష్ణకు 40 ఏళ్లకు పైగా అనుభవం ఉండగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు, గవర్ల ఓట్లు కీలకం కాగా వాళ్ల ఓట్లతో సులువుగా విజయం సాధిస్తానని ఆయన నమ్ముతున్నారు. మలసాల భరత్ అమెరికాలో వ్యాపారాలు చేసి ఏడాది క్రితం రాష్ట్రానికి తిరిగి వచ్చి వైసీపీ టికెట్ తెచ్చుకున్నారు. నియోజకవర్గ ప్రజలతో పెద్దగా పరిచయం లేకపోవడం ఆయనకు మైనస్ అయింది. ఏపీ పొలిటికల్ వర్గాల్లో అనకాపల్లి రిజల్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోందనే చెప్పాలి.
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>