MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dra4ab75ee-331d-4c8c-84ae-d91ffb7608b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dra4ab75ee-331d-4c8c-84ae-d91ffb7608b0-415x250-IndiaHerald.jpgశర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా శతమానం భవతి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2017 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ కి మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో దిల్ రాజు "శతమానం భవతి" సినిమాకి కొనసాగింపుగా "శతమానం భవతి నెక్స్ట్ పేజ్" అనే టైటిల్ తో ఓ మూవీ ని రూపొందించనున్నట్లు , దానిని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్Dr{#}Shatamanam Bhavathi;hari music;hari;Makar Sakranti;Posters;Ashish Vidyarthi;dil raju;Heroine;Cinema;Eventఅఫీషియల్ : "శతమానం భవతి 2" గురించి అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు..!అఫీషియల్ : "శతమానం భవతి 2" గురించి అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు..!Dr{#}Shatamanam Bhavathi;hari music;hari;Makar Sakranti;Posters;Ashish Vidyarthi;dil raju;Heroine;Cinema;EventThu, 23 May 2024 20:30:00 GMTశర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా శతమానం భవతి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2017 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ కి మంచి గుర్తింపు లభించింది.

ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో దిల్ రాజు "శతమానం భవతి" సినిమాకి కొనసాగింపుగా "శతమానం భవతి నెక్స్ట్ పేజ్" అనే టైటిల్ తో ఓ మూవీ ని రూపొందించనున్నట్లు , దానిని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశాడు.

ఇక ఈ పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఎన్ని రోజుల పాటు ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లు రాకపోవడంతో ఈ మూవీ పక్కకు వెళ్లిపోయింది అని చాలా మంది అనుకున్నారు. అలాంటి సమయం లోనే ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్ లు గత రెండు , మూడు రోజులుగా వస్తున్నాయి.

గత రెండు , మూడు రోజులుగా ఈ సినిమాకు హరి అనే వ్యక్తి కథను రాస్తున్నట్లు , ఆ కథ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చినట్లు , అందులో శర్వానంద్ కాకుండా దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ హీరోగా నటించబోతున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది.

తాజాగా దిల్ రాజు ఆ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ ... హరి మా కంపెనీలో దాదాపు పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం శతమానం భవతి నెక్స్ట్ పేజీ కి కథను రాస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆ కథ రైటింగ్ ఎండింగ్ కి వచ్చేసింది అని చెప్పాడు.

ఇక ఈయన ఈ సినిమాకు కథను అందించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకుడిగా కూడా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను మరికొన్ని రోజుల్లో మొదలు పెట్టి వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>