Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deathc7ff3a2e-f96d-417f-9a3e-9e2ce13ba89d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deathc7ff3a2e-f96d-417f-9a3e-9e2ce13ba89d-415x250-IndiaHerald.jpgఅదేంటో గాని నేటి రోజుల్లో మనుషులందరూ సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతూ ఉన్నారు. ఇక బయట ప్రపంచంతో అసలు సంబంధం లేకుండా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటున్నారు. అయితే ఇక అందరికీ ఎంటర్టైన్మెంట్ను అందించేందుకు ఎన్నో రకాల సోషల్ మీడియా ప్లాంట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఎక్కడో ఉన్న స్నేహితులతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు తప్ప.. పక్కనే ఉన్న స్నేహితులను అస్సలు పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా లైకుల మాయలో పడిపోతూ ఇక ఎన్నో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం కూడDeath{#}Instagram;police;media;Newsరీల్స్ కోసం.. 100 అడుగుల ఎత్తు నుండి దూకాడు.. చివరికి?రీల్స్ కోసం.. 100 అడుగుల ఎత్తు నుండి దూకాడు.. చివరికి?Death{#}Instagram;police;media;NewsThu, 23 May 2024 20:30:00 GMTఅదేంటో గాని నేటి రోజుల్లో మనుషులందరూ సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతూ ఉన్నారు. ఇక బయట ప్రపంచంతో అసలు సంబంధం లేకుండా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటున్నారు. అయితే ఇక అందరికీ ఎంటర్టైన్మెంట్ను అందించేందుకు ఎన్నో రకాల సోషల్ మీడియా ప్లాంట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఎక్కడో ఉన్న స్నేహితులతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు తప్ప.. పక్కనే ఉన్న స్నేహితులను అస్సలు పట్టించుకోవట్లేదు.


 అంతేకాకుండా లైకుల మాయలో పడిపోతూ ఇక ఎన్నో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇలా పాపులారిటీ సంపాదించేందుకు కొంతమంది ఏకంగా ప్రాణాలను కూడా ప్రమాదంలో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి తరహా ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక ఇక్కడ జార్ఖండ్లో కూడా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం చేసిన పని అందరినీ అవకాకయ్యేలా చేసింది.


 ఏకంగా ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ లైకులు సంపాదించాలి అని భావించి 100 అడుగుల ఎత్తు నుంచి నదిలో దూకాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. తౌఫిక్  అనే వ్యక్తి 100 అడుగుల ఎత్తు నుంచి క్వారీలోని చెరువులో దూకాడు. అయితే సరస్సులో స్నానం చేస్తున్న అతని స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఇక స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా చాలాసేపటి తర్వాత యువకుడి మృతదేహాన్ని వెలిక్కి తీశారు. అయితే సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అతని స్నేహితుడు రికార్డ్ చేస్తూ ఉండగా 100 అడుగుల ఎత్తు నుంచి యువకుడు నీటిలో దూకడం కనిపిస్తుంది. అయితే నీతిలో పడిన వెంటనే అతను ఈత కొట్టడం మొదలు పెట్టాడు. కానీ కొన్ని సెకన్లలో అతను మునిగిపోయాడు. ఇలా రీల్స్ లో లైక్ల కోసం ఇలాంటివి ఎవరూ చేయవద్దు అంటూ పోలీసులు హెచ్చరించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>