LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/social-media6f27983b-77be-4b45-9cc7-4bed07e2b3c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/social-media6f27983b-77be-4b45-9cc7-4bed07e2b3c5-415x250-IndiaHerald.jpgచిన్నప్పుడు చదువుకున్న చీమ కథ గుర్తిందిగా.. తన పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటూ చీమ చెప్పిన సమాధానం విని తెగ నవ్వుకునే వాళ్లం. కానీ అనవరసరమైన విషయాల జోలికి వెళ్తే.. దెబ్బతింటాం అనే విషయాన్ని ఈ కథ మనకు నేర్పిస్తుంది. ఇది మనకు అప్పట్లో పెద్దగా ఉపయోగపడలేదు కానీ.. ఇప్పుడు నిజ జీవితంలో అక్కరకు వస్తోంది. ప్రస్తుతం చీమ చిటుక్కుమన్నా ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయాల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుంచి.. రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి సోషల్ మీడియాలో మన దిన చర్య పోస్టు చేయకుండా నిద్ర పోయే వాళ్లు వందలో ఒకరో ఇద్దరో ఉsocial media{#}job;software;Manam;mediaఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌ బాగా వాడుతున్నారా.. అయితే మీరు డేజంర్‌లో ఉన్నట్టే?ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌ బాగా వాడుతున్నారా.. అయితే మీరు డేజంర్‌లో ఉన్నట్టే?social media{#}job;software;Manam;mediaThu, 23 May 2024 13:00:00 GMTచిన్నప్పుడు చదువుకున్న చీమ కథ గుర్తిందిగా.. తన పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటూ చీమ చెప్పిన సమాధానం విని తెగ నవ్వుకునే వాళ్లం. కానీ అనవరసరమైన విషయాల జోలికి వెళ్తే.. దెబ్బతింటాం అనే విషయాన్ని ఈ కథ మనకు నేర్పిస్తుంది. ఇది మనకు అప్పట్లో పెద్దగా ఉపయోగపడలేదు కానీ.. ఇప్పుడు నిజ జీవితంలో అక్కరకు వస్తోంది.


ప్రస్తుతం చీమ చిటుక్కుమన్నా ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయాల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుంచి.. రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి సోషల్ మీడియాలో మన దిన చర్య పోస్టు చేయకుండా నిద్ర పోయే వాళ్లు వందలో ఒకరో ఇద్దరో ఉంటారు. గంటల తరబడి రీల్స్, ఫేస్ బుక్ లో పోస్టులు, వాటిని చదవడం.. లైక్ లు కొట్టడం మనకి కావాల్సిన కంటెంట్ వెతకడం లాంటివి పొద్దెరెగకుండా చేస్తున్నాం.


అయితే మనం పెట్టే కామెంట్లు, చూసే వీడియోలు మనకిందికే నీళ్లు తెస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు. సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్న ప్రతి వ్యక్తి మీద సోషల్ మీడియ ఆల్గారిథం ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇది మన మీద పెత్తనం చెలాయిస్తోంది. అత్యధికంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాలంలో గడుపుతున్న వ్యక్తుల భద్రతకు భంగం కలిగిస్తోంది. దీని మూలంగానే సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. సైబర్ మోసగాళ్లకు సోషల్ మీడియా ఆల్గారిథం సహాయకారిగా పని చేస్తోంది.


సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అయిన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాం, యూ ట్యూబ్  వంటివి వ్యక్తిగత గోప్యతను హరిస్తున్నాయి. ఈ లింక్ డీల్ ల పనితీరు వెనుక సెర్చ్ ఇంజిన్ కు అనుసంధానం గా ఉండే ఆల్గారిథం మ్యాపింగ్ అనేక అనర్థాలకు దారి తీస్తోంది. మనం కొట్టే లైకులు, చూసే వీడియోలు, పెట్టే కామెంట్లు మన మానసిక స్థితిని, మన ఉద్యోగ, ఆర్థిక అవసరాలను తెలియజేస్తాయి.  వీటికి అనుగుణంగా మనకు సంబంధిత పోస్టులు, వీడియోలు వస్తుంటాయి. వీటిని సొమ్ము చేసుకొని మోసగాళ్లు రెచ్చిపోతుంటారు. మనకి ఫేక్ జాబ్ లు, తక్కువ సమయలో అధిక పెట్టుబడులు, క్రెడిట్ కార్డులు వంటి మోసాలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా యూజర్లు తస్మాత్ జాగ్రత్త.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>