PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababus-confident-calculations-are-surprising-to-many79eed25d-6be4-4d9f-8b9a-7bfca137a5f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababus-confident-calculations-are-surprising-to-many79eed25d-6be4-4d9f-8b9a-7bfca137a5f6-415x250-IndiaHerald.jpgఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరో పది రోజుల సమయం ఉండగా ప్రధానంగా కుప్పంలో బాబోరు ఓడిపోతారని జోరుగా చర్చ జరుగుతోంది. మరి కొందరు కూటమి గెలిచి బాబు ఓడిపోతే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. అలా జరిగితే మాత్రం కూటమికి ఒకింత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. chandrababu naidu{#}Party;TDP;CBN;CM;YCP;Newsకూటమి గెలిచి చంద్రబాబు ఓడిపోతే జరగబోయేది ఇదేనా.. అలా జరిగితే మాత్రం కష్టమేనా?కూటమి గెలిచి చంద్రబాబు ఓడిపోతే జరగబోయేది ఇదేనా.. అలా జరిగితే మాత్రం కష్టమేనా?chandrababu naidu{#}Party;TDP;CBN;CM;YCP;NewsThu, 23 May 2024 20:10:00 GMTఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరో పది రోజుల సమయం ఉండగా ప్రధానంగా కుప్పంలో బాబోరు ఓడిపోతారని జోరుగా చర్చ జరుగుతోంది. మరి కొందరు కూటమి గెలిచి బాబు ఓడిపోతే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. అలా జరిగితే మాత్రం కూటమికి ఒకింత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
సోషల్ మీడియాలో సైతం చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు కుప్పంలో బాబును ఓడించి తీరతామని శపథాలు చేస్తున్నారు. బాబు కంచుకోటలో ఈసారి లెక్కలు మారడం ఖాయమని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. కుప్పంలో చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని చెప్పడంలో టీడీపీ నేతలు ఫెయిల్ అవుతుండటం గమనార్హం.
 
చంద్రబాబు సైతం వైసీపీ నేతల నుంచి ఎన్ని కౌంటర్లు వస్తున్నా సైలెంట్ గా ఉన్నారే తప్ప స్పందించడం లేదు. చంద్రబాబు విదేశాల్లో ఉన్నా స్పందించడం ఎంతసేపు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి గెలిచి చంద్రబాబు ఓడిపోతే పవన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఓడిపోయినా ఆరు నెలల్లోపు మరో స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం అందుతోంది.
 
చంద్రబాబు అపర చాణిక్యుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుప్పంలో ఓడిపోయినా చంద్రబాబు ప్రణాళికలు ఆయనకు ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏ పార్టీ లెక్కలు నిజమవుతాయో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏపీలో ఏ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కూటమి, వైసీపీ వ్యూహాలలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో తెలియాల్సి ఉంది. వైసీపీ సైతం 150 స్థానాలలో విజయం అంటూ కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>