PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpa79ba3a3-8c7d-4b56-8792-eec6788705db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpa79ba3a3-8c7d-4b56-8792-eec6788705db-415x250-IndiaHerald.jpgకర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు బి.చిన్నోల జనార్దన్ రెడ్డి ఈసారి బనగానపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2014లో ఈ నియోజకవర్గం నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై విజయం సాధించారు. దాంతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టగలిగారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కానీ కాటసాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి అంటే 2024 ఎన్నికల్లో మళ్లీ బీసీ జనార్దన్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి బనగానపల్లె నుంచి ఎమ్మెల్యే అభ్యtdp{#}KATASANI RAMI REDDY;Rayalaseema;Backward Classes;war;Hanu Raghavapudi;Reddy;MLA;YCP;TDPరాయలసీమలో ఆయన కంటే పోటుగాడు లేడు.. వైసీపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించబోతున్నారు..?రాయలసీమలో ఆయన కంటే పోటుగాడు లేడు.. వైసీపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించబోతున్నారు..?tdp{#}KATASANI RAMI REDDY;Rayalaseema;Backward Classes;war;Hanu Raghavapudi;Reddy;MLA;YCP;TDPWed, 22 May 2024 10:33:01 GMTకర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు బి.చిన్నోల జనార్దన్ రెడ్డి ఈసారి బనగానపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2014లో ఈ నియోజకవర్గం నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై విజయం సాధించారు. దాంతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టగలిగారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కానీ కాటసాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి అంటే 2024 ఎన్నికల్లో మళ్లీ బీసీ జనార్దన్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి బనగానపల్లె నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

అయితే ఈసారి వార్ వన్ సైడ్ అయిపోతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల ప్రచార సమయంలో బనగానపల్లె ప్రజలు బీసీ జనార్దన్ రెడ్డికి పూర్తిగా సంఘీభావం తెలిపారు. తమ మనసులను గెలుచుకున్న నాయకుడి అన్నట్లు ఆయనపై ఆప్యాయత కురిపించారు. ఇళ్లలోకి తీసుకెళ్లి హారతులు ఇస్తూ ఈసారి మీరే గెలవాలి అంటూ, విజయీభవ అంటూ ఆశీర్వదించారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆయన అలుపెరగకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎనలేని తమ అభిమానాన్ని జనార్దన్ రెడ్డి పై చూపించారు. ఈ సమయంలో టీడీపీ సిక్స్ గ్యారెంటీలను ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు.

 జనార్దన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు బనగానపల్లె నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నారు. అందువల్ల ఆయన కంటే మించిన నేత తమకు దొరకడని ప్రజలు భావిస్తున్నారు. సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిస్వార్థ సేవకుడు జనార్దన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలని ఆ నియోజకవర్గ ప్రజలు భావించినట్లు స్పష్టంగా తెలిసింది. అందుకే ప్రతి ఇంటి సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాయలసీమ ఇతర నియోజకవర్గాలలో వైసీపీ వాళ్ళు గెలవచ్చేమో కానీ బనగానపల్లెలో జనార్దన్ రెడ్డిని కొట్టేవారు లేరు. ఆయన ఈసారి వైసీపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించే అవకాశం ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>