PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6bd5978d-f760-4026-9471-513557e656a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6bd5978d-f760-4026-9471-513557e656a0-415x250-IndiaHerald.jpgఏపీలో జనాలు ఎన్నికల రిజల్ట్స్ కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. అయితే దానికి ఇంకా 12 రోజుల సమయం గడువు వుంది. అవును, జూన్ 4న ఎన్నికల తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఈలోగా ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు... ఏదో ఇష్టమైన హీరో సినిమా రిలీజుకి ముందు అభిమానులు ఊహించినట్టు. ఓ రకంగా చెప్పాలంటే ఈసారి ఆంధ్రా ఎన్నికలు జనసేనాని మహిమతో మంచి రసవత్తరంగా మారాయనే చెప్పుకోవాలి. జగన్ కి ఇంకా ఎదురులేదు అన్న తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించి జగన్ ఆవేశానికి అడ్డకట్ట వేశాడు. jagan{#}kalyan;School;Hero;English medium;Elections;June;Jagan;YCPఏపీ: జగన్ మరింత డబ్బు ఖర్చు చేస్తే ధీమాగా కాలుమీద కాలేసుకుని కూర్చునేవాడు?ఏపీ: జగన్ మరింత డబ్బు ఖర్చు చేస్తే ధీమాగా కాలుమీద కాలేసుకుని కూర్చునేవాడు?jagan{#}kalyan;School;Hero;English medium;Elections;June;Jagan;YCPWed, 22 May 2024 11:35:00 GMTఏపీలో జనాలు ఎన్నికల రిజల్ట్స్ కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. అయితే దానికి ఇంకా 12 రోజుల సమయం గడువు వుంది. అవును, జూన్ 4న ఎన్నికల తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఈలోగా ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు... ఏదో ఇష్టమైన హీరో సినిమా రిలీజుకి ముందు అభిమానులు ఊహించినట్టు. ఓ రకంగా చెప్పాలంటే ఈసారి ఆంధ్రా ఎన్నికలు జనసేనాని మహిమతో మంచి రసవత్తరంగా మారాయనే చెప్పుకోవాలి. జగన్ కి ఇంకా ఎదురులేదు అన్న తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించి జగన్ ఆవేశానికి అడ్డకట్ట వేశాడు.

ఇక ఈసారి ఎన్నికల ప్రచారాలు ఏమాదిరి జరిగాయో మీకు తెలియంది కాదు. ఆంధ్రా జనాలకోసం ఎంతో చేశామని జగన్ తన ప్రచారంలో భాగంగా చెప్పుకు రావడం అందరికీ తెలిసినదే. మొదట్లో జగన్ సంక్షేమ పధకాల గురించి జనాలకు గుర్తు చేస్తూ తరువాత అభివృద్ధి చేసానని జనాలకు చెప్పేవారు. ఆయన పాల్గొన్న ప్రతీ ఎన్నికల సభలో దాదాపు గంట పాటు కేవలం తన పాలనలో ఏమి చేశాను? అన్న దాని మీదనే ఎక్కువగా మాట్లాడడం జరిగింది. వారు చెబుతున్న లెక్కలు ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నగదుని బదిలీ చేసే కార్యక్రమం కింద 4 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించింది వైసీపీ. ఇక నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం చదువులు, పాఠశాల విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం ఇలా స్కూల్ డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు చేసిందో ఊహించుకోవచ్చు.

అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి సరిగ్గానే ఉంటాయి. కానీ అసలు విషయం ఏంటంటే ప్రజలకు నేరుగా కళ్ళకు కనిపించేవి రోడ్డు, ఇరిగేషన్ ప్రాజెక్టులే అని విశ్లేషకులు అంటున్నారు. అవును, జగన్ ప్రభుత్వం రోడ్ల విషయంలో ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే కనుక ఆయన పాలనలో జరిగిన అభివృద్ధి విషయం కూడా జనాలకు బాగా ఎక్కేది. తద్వారా జనాలు ఓట్లను కుమ్మరించేవారు అని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా రైతులకు వివిధ రకాలైన పని ముట్ల కింద మరో అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అవి కూడా కంటికి కనిపించేవి అని అంటున్నారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే వైసీపీ తన బలాన్ని ఇంతకు ఇంతా పెంచుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకో మరో ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టేందుకు ఆలోచించిందా? అన్నదే ఇపుడు చర్చగా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>