PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telugudesam-changed-the-entire-scene-with-a-pen-drive4e265534-80a6-4f96-b9f0-cf3a9b0cbdd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telugudesam-changed-the-entire-scene-with-a-pen-drive4e265534-80a6-4f96-b9f0-cf3a9b0cbdd7-415x250-IndiaHerald.jpgఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీ కచ్చితంగా గెలిచే ఒకే ఒక్క నియోజకవర్గం ఏదనే ప్రశ్నకు కర్నూలు అసెంబ్లీ అనే సమాధానం వినిపిస్తోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున టీజీ భరత్ పోటీ చేయడం టీడీపీకి ప్లస్ అయిందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానమిదే అంటూ సర్వేలలో సైతం వెల్లడవుతూ ఉండటం గమనార్హం.kurnool{#}bharath;Sri Bharath;MP;District;Industries;Kurnool;MLA;Assembly;local language;YCP;June;TDPకర్నూలు జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానమిదే.. ఆ వ్యూహాలు ఫలించాయా?కర్నూలు జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానమిదే.. ఆ వ్యూహాలు ఫలించాయా?kurnool{#}bharath;Sri Bharath;MP;District;Industries;Kurnool;MLA;Assembly;local language;YCP;June;TDPWed, 22 May 2024 09:00:00 GMTఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీ కచ్చితంగా గెలిచే ఒకే ఒక్క నియోజకవర్గం ఏదనే ప్రశ్నకు కర్నూలు అసెంబ్లీ అనే సమాధానం వినిపిస్తోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున టీజీ భరత్ పోటీ చేయడం టీడీపీకి ప్లస్ అయిందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానమిదే అంటూ సర్వేలలో సైతం వెల్లడవుతూ ఉండటం గమనార్హం.
 
టీజీ భరత్ కూటమి మేనిఫెస్టోను ప్రచారం చేయడంతో పాటు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారో కూడా చెప్పుకొచ్చారు. తాను లోకల్ అభ్యర్థినని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రచారం చేసుకోవడం కూడా టీజీ భరత్ కు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. టీజీ భరత్ స్థానికంగా కొన్ని పరిశ్రమలు స్థాపించి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు.
 
జిల్లాలో మంచి పేరు ఉండటం టీజీ భరత్ కు కలిసొచ్చింది. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి టీజీ భరత్ వద్ద అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీ నుంచి ఇంతియాజ్ పోటీ చేయగా టీజీ భరత్ తో పోల్చి చూస్తే జిల్లా ప్రజలకు ఆయన గురించి పెద్దగా తెలియదు. 99 శాతం టీజీ భరత్ గెలుపుకే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీజీ భరత్ కుటుంబ సభ్యులు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు..
 
జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని టీజీ భరత్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కర్నూలులో క్రాస్ ఓటింగ్ జరిగిందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ఓటు టీడీపీ అభ్యర్థి అయిన టీజీ భరత్ కు ఎంపీ ఓటు వైసీపీ అభ్యర్థి అయిన బీవై రామయ్యకు పోల్ అయినట్టు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మాత్రం ఫలితాలు వెలువడే వరకు ఆగాల్సిందే.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>