PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bobbili--tdp-vs-ycpad505ccf-da4e-4581-9f7a-6d69d812a487-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bobbili--tdp-vs-ycpad505ccf-da4e-4581-9f7a-6d69d812a487-415x250-IndiaHerald.jpg•బొబ్బిలిలో రసవత్తర పోటీ •ఈసారి 100% టీడీపీ గెలుపు ఖాయం బొబ్బిలి - ఇండియా హెరాల్డ్: 1951లో ఏర్పాటైన బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏడుసార్లు విజయం సాధించగా.. టీడీపీ మూడుసార్లు, వైఎస్సార్సీపీ రెండుసార్లు గెలిచాయి. 1952లో మద్రాస్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో సోషల్ పార్టీకి చెందిన కొల్లి కురుణి నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 1955లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోటగిరి సీతారామ స్వామి, 1962లో తెంటు లక్ష్ము నాయుడు ఎమ్మెల్యేలుగా విజయం సాధించBobbili - TDP Vs YCP{#}krishna;East;IYR KrishnaRao;Bobbili;Chennai;India;Minister;Congress;MLA;Hanu Raghavapudi;YCP;News;TDPబొబ్బిలి: ఈసారి టీడీపీకి 100% విక్టరీ ఖాయం?బొబ్బిలి: ఈసారి టీడీపీకి 100% విక్టరీ ఖాయం?Bobbili - TDP Vs YCP{#}krishna;East;IYR KrishnaRao;Bobbili;Chennai;India;Minister;Congress;MLA;Hanu Raghavapudi;YCP;News;TDPWed, 22 May 2024 11:24:18 GMT•బొబ్బిలిలో రసవత్తర పోటీ 
•ఈసారి 100% టీడీపీ గెలుపు ఖాయం


బొబ్బిలి - ఇండియా హెరాల్డ్: 1951లో ఏర్పాటైన బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏడుసార్లు విజయం సాధించగా.. టీడీపీ మూడుసార్లు, వైఎస్సార్సీపీ రెండుసార్లు గెలిచాయి. 1952లో మద్రాస్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో సోషల్ పార్టీకి చెందిన కొల్లి కురుణి నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 1955లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోటగిరి సీతారామ స్వామి, 1962లో తెంటు లక్ష్ము నాయుడు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.బొబ్బిలి రాజవంశీకుడైన ఎస్‌ఆర్కే కృష్ణ రంగారావు 1967లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవగా 1972లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీవీ కృష్ణారావు గెలిచే ఎమ్మెల్యే అయ్యారు. 1983, 1985ల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శంబంగి చిన వెంకట అప్పల నాయుడు ఎమ్మెల్యే అయ్యారు. 1994లో కూడా గెలిచిన ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో పెద్దింటి జగన్మోహన్ రావు.. అప్పల నాయుణ్ని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు.2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బొబ్బిలి రాజవంశీయుడు.. రావు వెంకట కృష్ణ సుజయ కృష్ణ రంగారావు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. బొబ్బిలి నుంచి హ్యాట్రిక్ సాధించిన ఏకైక నేతగా ఆయన నిలిచారు.


కానీ 2016 వ సంవత్సరంలో టీడీపీలో చేరిన రంగారావు మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావు ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి బరిలోకి దిగిన అప్పల నాయుడు ఏకంగా 8 వేల ఓట్ల తేడాతో గెలిచి, నాలుగవసారి బొబ్బిలి ఎమ్మెల్యే అయ్యారు. 2019 జూన్ 6న ఆయన ప్రొటెం స్పీకర్‌ అయ్యారు. 2024లో వైఎస్సార్సీపీ నుంచి శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పోటీ చేయనుండగా.. టీడీపీ నుంచి రంగారావు సోదరుడు బేబీ నాయన పోటీ చేశారు.అయితే బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీకి పెద్దగా పట్టులేదని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ మూడుసార్లు మాత్రమే గెలవగా.. ఆ మూడు పర్యాయాలూ చిన అప్పలనాయుడే గెలిచారు.


ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈసారి టీడీపీ 100% విన్ అయ్యే ఛాన్స్ ఉంది.బొబ్బలిలో సామాజికవర్గాల వారీగా ఓటర్లను చూస్తే.. తూర్పు కాపులు దాదాపు 70 వేల మంది మంది ఉండగా.. కొప్పుల వెలమలు 51,980 మంది, తెలగలు 14,406 మంది, యాదవులు 13,354 మంది, మాదిగలు 12,850, మాలలు 15,739, కొండ దొరలు 6262 మంది ఉన్నారు. బొబ్బలి నియోజకవర్గంలో కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఈసారి వారు టీడీపీకి ఓట్లు వేశారని ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది. అలాగే తెలగలు కూడా టీడీపీకే ఓట్లు వేశారని తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>